E-Paper
Advertisement

Horror Comedy Movie: అప్పులు తీర్చడానికి 400 ఏళ్ల నాటి రాజభవనం అమ్మకం… తోలు తీసే ప్రేతాత్మ… ఐయండిబిలో టాప్ రేటింగ్

Horror Comedy Movie: అప్పులు తీర్చడానికి 400 ఏళ్ల నాటి రాజభవనం అమ్మకం… తోలు తీసే ప్రేతాత్మ…  ఐయండిబిలో టాప్ రేటింగ్
Advertisement

Horror Comedy Movie : పాతకాలపు మనుషుల ఎమోషన్స్‌ తో ఒక హర్రర్ కామెడీ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. బెంగాలీ ఇండస్ట్రి నుంచి వచ్చిన ఈ సినిమా, ఒక అద్భుతమైన హర్రర్ కామెడీగా పేరు తెచ్చుకుంది. ఐయండిబిలో దీనికి 8.0/10 రేటింగ్ కూడా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక రాజ వంశస్థుడు, 400 ఏళ్ల నాటి తన పాత రాజభవనాన్ని అమ్మాలని ప్లాన్ చేసినప్పుడు కథలో ఒక దెయ్యం వస్తుంది. ఆ తరువాత వచ్చే సీన్స్ తో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

ఎక్కడ చూడవచ్చు?

ఈ బెంగాలీ సూపర్‌నేచురల్ కామెడీ హర్రర్ మూవీ పేరు ‘బల్లభ్‌పురేర్ రూప్‌కోత’ (Ballabhpurer Roopkotha). అనిర్బన్ భట్టాచార్య దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రం 1954లో బాదల్ సర్కార్ రాసిన నాటకం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం 2022 అక్టోబర్ 25న కాళీ పూజా స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. U సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ దాదాపు 2 గంటల 16 నిమిషాల నిడివితో ఉంటుంది. శ్రీ వెంకటేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. ఇందులో సత్యం భట్టాచార్య , సురంగన బందోపాధ్యాయ, దేబ్రాజ్ భట్టాచార్య వంటి నటులు నటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా బెంగాలీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. Hoichoi, Amazon Prime Video, Jio hotstar లలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

బళ్లభపూర్ రాజవంశానికి చివరి వారసుడైన భూపతి రాయ్ అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. తనకున్న ఒకే ఒక్క ఆస్తి 400 ఏళ్ల నాటి పాత కోట. ఆ శిథిలావస్థలో ఉన్న కోటను అమ్మేసి, తన అప్పులు తీర్చుకుని కలకత్తాలో స్థిరపడాలని భూపతి ప్లాన్ చేస్తాడు. కానీ ఆ కోటలో భూపతితో పాటు వాళ్ల తాతల కాలం నాటి ఒక దెయ్యం కూడా ఉంటుంది. కోటను కొనడానికి వచ్చే కస్టమర్ల ముందు ఈ దెయ్యం విషయం బయటపడకుండా మేనేజ్ చేయడానికి భూపతి తన స్నేహితుడు సంజీవ్‌తో కలిసి చేసే ప్రయత్నాలు చాలా నవ్వు తెప్పిస్తాయి.

ఒక రోజు ఆ కోటను కొనడానికి హల్దార్ అనే కుటుంబం అక్కడికి వచ్చినప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ రాత్రి కోటలో జరిగే వింత సంఘటనలు, గందరగోళం, దెయ్యం చేసే పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. చివరకు ఆ దెయ్యం సమస్య తీరిందా? భూపతి తన కోటను అమ్మి అప్పుల నుండి బయటపడ్డాడా? అన్నదే ఈ సినిమా మిగిలిన కథ.

Advertisement

Read Also : హార‌ర్‌ నుంచి యాక్షన్ వరకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరే బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, సిరీస్‌లు

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×