E-Paper
Advertisement

Kalki 2: కల్కి 2 లో సుమతిగా సాయి పల్లవి.. రూమర్లపై స్పందించిన మూవీ టీమ్!

Kalki 2: కల్కి 2 లో సుమతిగా సాయి పల్లవి.. రూమర్లపై స్పందించిన మూవీ టీమ్!
Advertisement

Kalki 2: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన కొత్త సినిమాలు మాత్రమే కాకుండా సీక్వెల్ సినిమాలో షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి(Kalki) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా ఉండబోతుందని నాగ్ అశ్విన్ (Nag Aswin)ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని మరొక నెలలో షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

దీపికా స్థానంలో సాయి పల్లవి..

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే (Deepika Padukone)హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ సినిమాలో మాత్రం దీపిక నటించడం లేదు అంటూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. కొన్ని కారణాలవల్ల కల్కి సీక్వెల్ సినిమా నుంచి దీపికను తప్పిస్తున్నట్టు చిత్రబృందం అధికారకంగా తెలియజేశారు. దీంతో కల్కి సీక్వెల్ సినిమాలో సుమతి పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. అలాగే ఈ పాత్రలో నటించే హీరోయిన్ ఈమె అంటూ ఎన్నో పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక కల్కి సినిమాలో సుమతి పాత్రలో సాయి పల్లవి(Sai Pallavi) నటించబోతున్నారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియదు కానీ ఈ సినిమాలో సాయి పల్లవి ఎంపికయ్యారు అనే విషయం తెలిసి ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాయి పల్లవిని సంప్రదించిన కల్కి టీం…

Advertisement

ఈ విధంగా సాయి పల్లవి ఈ సినిమాలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ వార్తలపై కల్కి చిత్ర బృందం స్పందించారు. సాయి పల్లవి కల్కి సినిమాలో నటించడం గురించి మూవీ టీమ్ కు చెందిన ఒక ప్రతినిధి స్పందిస్తూ.. కల్కి సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఈ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకున్న తర్వాత చిత్ర బృందం సాయి పల్లవిని సంప్రదించారనే మాట వాస్తవమే కానీ ఫైనల్ అయ్యారు అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు.

సుమతి పాత్రలో సాయి పల్లవి..

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది అంటూ వస్తున్న వార్తలను కూడా ఖండించారు. అయితే సాయి పల్లవి సుమతి పాత్రకు సరిగా సూట్ అవుతారని చిత్ర బృందం కూడా భావిస్తున్నట్లు తెలియచేశారు. ఇలా సుమతి పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోతారని విషయాన్ని వెల్లడించడంతో కచ్చితంగా ఈమెను ఎంపిక చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో సాయి పల్లవి వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ రామాయణ సినిమాతో పాటు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే ధనుష్ 55వ సినిమాలో కూడా ఎంపికయ్యారు. ఇక త్వరలోనే కల్కి సినిమాలో కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది .

Also Read: Actor madhavan: ఆ రైతు దెబ్బకు నాలుగేళ్లు సినిమాలు వదిలేసిన మాధవన్, అసలు ఏమైంది?

Related News

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

Big Stories

Advertisement
×