E-Paper
Advertisement

Akhanda 2: అఖండ 2 సినిమాకు షాక్.. తెలంగాణ హైకోర్టులో మరో కేసు…

Akhanda 2: అఖండ 2 సినిమాకు షాక్.. తెలంగాణ హైకోర్టులో మరో కేసు…
Advertisement

Akhanda 2: అఖండ 2 సినిమా విడుదల ముహూర్తం ఏ రోజు ప్రకటించారో తెలియదు కానీ అప్పటినుంచి వరుసగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కావాలి కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడుతూ డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రీమియర్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరొక అడ్డంకి ఎదురైంది.

టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్..

తాజాగా ఈ సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టులో న్యాయవాది శ్రీనివాసరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కాలంలో ప్రతి సినిమాకు ప్రభుత్వాలు టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఆఖండ 2 సినిమాకి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సినిమా ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున టికెట్ ధరలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని అనుమతి తెలిపారు. మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

20% సినీ కార్మికుల సంక్షేమానికి..

Advertisement

ఇలా సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ మరొక కండిషన్ కూడా పెట్టారు. ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల వచ్చే లాభాలలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని షరతులు పెట్టారు. ఇంతవరకు బానే ఉన్నప్పటికీ తాజాగా న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి టికెట్ ధరల పెంచడం గురించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమాకు మరొక అడ్డంకి తలెత్తిందని చెప్పాలి. మరి ఈ పిటిషన్ విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు సినిమా టికెట్ల ధరలపై ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో తెలియాల్సి ఉంది.

ఆంధ్రాలో కూడా పెరిగిన టికెట్ ధరలు..

Advertisement

అఖండ సినిమాకు ఆంధ్రాలో కూడా టికెట్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లలో ₹100 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే పెంచిన ధరలు 10 రోజులపాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక ప్రీమియర్లకు 600 రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి తెలిపింది.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా టికెట్ల ధరలు పెంచడానికి అనుమతి తెలిపాయి కానీ తెలంగాణలో మాత్రం పెంచిన టికెట్ల ధరలకు ఇలా అడ్డంకి ఏర్పడటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మరి న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ పై కోర్ట్ తీర్పు ఏంటో తెలియాల్సి ఉంది.

Also Read: 3 Roses season 2 :అఖండ 2 కోసం సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు వాయిదా .. ఫస్ట్ టైమ్ ఇలా?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×