E-Paper
Advertisement

3 Roses season 2 :అఖండ 2 కోసం సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు వాయిదా .. ఫస్ట్ టైమ్ ఇలా?

3 Roses season 2 :అఖండ 2 కోసం సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు వాయిదా .. ఫస్ట్ టైమ్ ఇలా?
Advertisement

3 Roses season 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ 2(Akhanda 2) సినిమా మరి కొన్ని గంటలలో ప్రసారం కానుంది. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఫైనాన్స్ సమస్యల కారణంగా 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే 11వ తేదీ ప్రీమియర్లను ప్రసారం చేయనున్నారు. ఇలా ఈ సినిమా 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అదేరోజు విడుదల అవుతున్న చిన్న సినిమాలన్నీ కూడా పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలా అఖండ లాంటి పెద్ద సినిమాతో పోటీగా రావడం రిస్క్ అని తెలిసి ఎన్నో చిన్న సినిమాలు తప్పుకోవడంలో అర్థం ఉంది. కానీ వెబ్ సిరీస్ లో కూడా వాయిదా పడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ 13న 3 రోజెస్ 2 స్ట్రీమింగ్..

ఇప్పటికే డిసెంబర్ 12వ తేదీ విడుదల కావలసిన మోగ్లీ, ఈషా, సైక్ సిద్ధార్థ్ వంటి సినిమాలన్నీ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే .అయితే ఆహాలో స్ట్రీమింగ్ కానున్న త్రీ రోజెస్ సీజన్ 2(3 Roses 2) వెబ్ సిరీస్ కూడా వాయిదా పడటంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోనే ఇలా జరగలేదని మొదటిసారి ఒక సినిమా విడుదల అవుతుంటే వెబ్ సిరీస్ లు కూడా వాయిదా వేసుకోవడం జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 12వ తేదీ ఆహా(Aha)లో ప్రసారం కావాల్సి ఉండేది. బాలకృష్ణ అఖండ 2 కూడా 12వ తేదీనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను ఒకరోజు వాయిదా వేసుకుని డిసెంబర్ 13వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

బాలయ్య సినిమా కోసం వెబ్ సిరీస్ వాయిదా..

Advertisement

ఇక ఈ విషయం గురించి నిర్మాత ఎస్ కే ఎన్(SKN) కూడా వెల్లడించడంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సిరీస్ పోస్ట్ పోన్ అవ్వడం గురించి విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే ఇదివరకే త్రీ రోజెస్ సీజన్ వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రెండవ సీజన్ కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ సిరీస్ ను కిరణ్ కె దర్శకత్వం వహించగా ఎస్కేన్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ముగ్గురు స్నేహితుల కథ..

Advertisement

ఇక ఈ సిరీస్ లో ఈషా రెబ్బా, కుషిత కల్లపు, రాశి సింగ్, సత్య, వైవా హర్ష వంటివారు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ వచ్చారు. అయితే చివరి నిమిషంలో ఈ సిరీస్ వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్టు నిర్మాత ఎస్కేన్ తెలిపారు. ఇక ఈ సిరీస్ ఒక కామెడీ-డ్రామాగా రాబోతుంది. ఇదొక ముగ్గురు స్నేహితుల కథ, వారి జీవితాల్లోకి వచ్చే మలుపులు, పెళ్ళిళ్ళ చుట్టూ ఈ సిరీస్ కొనసాగుతుంది.

Also Read: Akhanda 2 Day1 Collections : అడ్వాన్స్ బుకింగ్‌లో బాలయ్య ఊచకోత.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూళ్లు అంటే?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×