E-Paper
Advertisement

iPhone 15 Vs 16 Offer: కేవలం రూ.60లలోపే రెండు ఐఫోన్‌లు.. ఐఫోన్15 vs 16 ఏది బెస్ట్?

iPhone 15 Vs 16 Offer: కేవలం రూ.60లలోపే రెండు ఐఫోన్‌లు.. ఐఫోన్15 vs 16 ఏది బెస్ట్?
Advertisement

iPhone 15 Vs 16 Offer: ఆపిల్ ఐఫోన్ పేరు ఎప్పటి నుంచో ప్రీమియం అనుభవం, స్థిరమైన సాఫ్ట్‌వేర్, నాణ్యమైన నిర్మాణం కోసం ప్రసిద్ధి. టెక్నాలజీ ప్రపంచంలో ఒక ట్రెండ్ సృష్టించే బ్రాండ్‌గా ఆపిల్ ఎప్పుడూ ముందుంటుంది, అందుకే ప్రతి కొత్త ఐఫోన్ లాంచ్‌కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఆపిల్ అభిమానులకు ఒక గొప్ప అవకాశం లభించింది. ఇండియాలో డిమాండ్‌లో ఉండే ఐఫోన్ 15 అలాగే కొత్త ఐఫోన్ 16 మోడల్స్ రెండూ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా, ఎటువంటి బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు, కూపన్‌లు అవసరం లేకుండా, రూ. 60000 లోపు లభిస్తున్నాయి. ఇది ఆపిల్ ఎకోసిస్టమ్ అనుభవాన్ని మొదటిసారి ప్రయత్నించాలని అనుకునేవారికైనా, ఇప్పటికే వాడుతున్న ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ కావాలనుకునేవారికి కూడా నిజంగా సరైన సమయం.

ఐఫోన్ 15 (iPhone 15) ధర రూ. 51,999

Advertisement

ఐఫోన్ 15 గురించి మాట్లాడితే, ఇది ఆపిల్ ఇచ్చే క్లాసిక్ లుక్‌ను అలాగే కొనసాగిస్తూ స్మూత్ ఐఫోన్ అనుభవాన్ని ఇస్తుంది. ఇందులో ఇచ్చిన 48ఎంపి మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ డే లైట్ ఫోటోలు చాలా నేచురల్‌గా ఇస్తుంది. రెటినా క్లాస్ డిస్‌ప్లే ఇస్తున్న స్పష్టమైన విజువల్స్, ఐఓఎస్ ఇచ్చే స్మూత్ అనుభవం, రోజంతా నిలిచే బ్యాటరీ సపోర్ట్ ముఖ్యంగా 128జిబి వేరియంట్ ధర ఇప్పుడు సుమారు రూ. 51,999 కు పడిపోయింది. ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి బడ్జెట్‌ను ఎక్కువగా పెంచకుండా అడుగు పెట్టాలనుకునేవాళ్లకు ఇది నిజంగా మంచి డీల్‌గా కనిపిస్తోంది. రోజువారీ సోషల్ మీడియా, కాల్స్, బ్రౌజింగ్, కాస్త కెమెరా అన్నీ పనుల కోసం ఐఫోన్ 15 చాలా బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఎవరికైతే సింప్లిసిటీ, ధర గురించి ఆలోచించే వారికోసం ఇది ఇంకా బెటర్‌గా సరిపోతుంది.

ఫ్యూచర్ రెడీ అనిపించే ఫోన్‌ ఐఫోన్ 16

Advertisement

ఇప్పుడు ఐఫోన్ 16 వైపు చూస్తే, ఇది భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మోడల్ అన్న భావన మొదటి చూపులోనే స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త ఏ18 చిప్ వల్ల స్పీడ్, ఎఫిషెన్సీ, మల్టీటాస్కింగ్ అన్నీ కలిసి ఏ16తో పోలిస్తే మరింత స్మూత్ అనుభవం ఇస్తాయి. డిజైన్‌లో కూడా మార్పులు వచ్చాయి, ఐఫోన్ 15లో ఉన్న డయాగనల్ కెమెరా సెటప్‌ను మార్చి ఈసారి వెర్టికల్ ప్లేస్‌మెంట్ ఇవ్వడం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మ్యూట్ స్విచ్‌ను తొలగించి, కస్టమైజ్ చేయగలిగే యాక్షన్ బటన్ పెట్టడం రోజువారీ ఉపయోగంలో నిజంగా ఉపయోగపడే మార్పు. అలాగే కెమెరా విషయంలో మ్యాక్రో సామర్థ్యం, అల్ట్రా వైడ్ లెన్స్‌లో ఆటోఫోకస్, కెమెరా కంట్రోల్ బటన్ అన్నీ కలిసి ఫోటోలు తీయడం మరింత సులభం అలాగే కంఫర్ట్‌గా మారుస్తాయి. మొత్తం మీద ఈ అప్‌గ్రేడ్స్ వల్ల ఐఫోన్ 16 వాడిన వెంటనే ఫ్యూచర్ రెడీ అనిపించే ఫోన్‌గా నిలుస్తుంది.

Also Read: BSNL Learners Plan: కేవలం 2 రోజులే ఛాన్స్.. రూ.9కే అపరిమిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్ లెర్నర్స్ ఆఫర్ మిస్ కావొద్దు

ఐఫోన్ 16 (iPhone 16) ధర రూ. 57999

బ్యాటరీ లైఫ్ కూడా మెరుగైందని ఆపిల్ చెబుతోంది. ఐఫోన్ 15లో సుమారు 20 గంటల వీడియో ప్లేబ్యాక్ లభిస్తే, ఐఫోన్ 16లో అది 22 గంటలకు పెరిగింది. మరో ముఖ్యమైన విషయం ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్. ఇవి మొత్తం సామర్థ్యంతో పని చేయడానికి కొత్త చిప్ అవసరం అవుతుంది, అందుకే ఐఫోన్ 16 భవిష్యత్తు లక్ష్యంగా డిజైన్ చేయబడిన ఫోన్ అని అర్థం అవుతుంది. ధర విషయానికి వస్తే, ఐఫోన్ 16లో 128జిబి వేరియంట్ సుమారు రూ. 57999 వద్ద లభిస్తోంది.

ఐఫోన్ 16 Vs ఐఫోన్ 15 (iPhone 16 vs iPhone 15)

ఇప్పుడు కొనేటప్పుడు చాలా సింపుల్‌గా ఆలోచిస్తే, భవిష్యత్తు కోసం బలమైన పెర్‌ఫార్మెన్స్, ఎక్కువకాలం వాడుకోగలిగే ఫోన్, అప్‌కమింగ్ ఆపిల్ ఫీచర్స్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి అనుకుంటే ఐఫోన్ 16 సరైన ఎంపిక అవుతుంది. అయితే మీ బడ్జెట్ కట్టుదిట్టంగా ఉంటే, రోజువారీ పనులకు రిఫ్రెషింగ్ ఐఫోన్ అనుభవం కావాలంటే ఐఫోన్ 15 ఇప్పటికీ చాలా ప్రాక్టికల్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అందుకే మీరు ఫ్యూచర్‌ ప్రూఫ్ ఫీచర్స్‌కి ప్రాధాన్యం ఇస్తే ఐఫోన్ 16 మీ కోసం. బడ్జెట్‌‌లో సింపుల్‌గా అలాగే స్ట్రాంగ్ యూజ్ అనుభవాన్ని కోరుకుంటే ఐఫోన్ 15 అద్భుతమైన ఎంపిక.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×