Aishwarya Rajesh: అనిల్ రావిపూడి ఈ పేరు తెలియని ప్రేక్షకులు లేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ల జాబితాలో ఒకరిగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి ప్రతి ఏడాది ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటుంది. ఇక ఈ ఏడాది ఈయన చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఇలాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) అంటే ఎవరో నాకు తెలియదు అంటూ నటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
అనిల్ రావిపూడి ఎవరూ తెలియదు అని చెప్పిన ఆ బ్యూటీ ఎవరు? ఎందుకలా చెప్పారనే విషయానికి వస్తే… అనిల్ రావిపూడి ఎవరో నాకు తెలియదు అంటూ షాక్ ఇచ్చింది మరెవరో కాదు అనిల్ డైరెక్షన్లో సూపర్ సక్సెస్ అందుకున్న నటి ఐశ్వర్య రాజేష్. అనిల్ డైరెక్షన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయం గురించి మాట్లాడుతూ… సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు ఒక సంవత్సరం వరకు నాకు ఎలాంటి సినిమా అవకాశాలు లేవు కానీ ఆ సమయంలో అనిల్ రావిపూడి ఫోన్ చేసి మీతో ఆడిషన్ చేయాలి సినిమా కోసం అంటూ చెప్పారు.
ఇలా అనిల్ రావిపూడి ఫోన్ చేసే వరకు నాకు ఆయన ఎవరో తెలియదు వెంటనే అనిల్ రావిపూడి అంటే ఎవరో తెలుసుకోవడం కోసం గూగుల్ సెర్చ్ చేసానని ఆయన గురించి తెలిసిన తర్వాత తనతో మాట్లాడానని తెలిపారు. అయితే తెలుగు సినిమా కోసం ఆడిషన్ కి పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఆయన చెప్పినట్టుగానే ఆడిషన్ కి వెళ్ళాను నాతో రెండు మూడు డైలాగులు చెప్పించారు మేకప్ కూడా వేశారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ పాత్రకు నేను సెట్ అవ్వను నేను చేయనని అనిల్ రావిపూడితో చెప్పినట్టు ఐశ్వర్య రాజేష్ తెలిపారు.
సంక్రాంతికి వస్తున్నాం రిజెక్ట్ చేశాను…
ఐశ్వర్య అంటేనే సీరియస్ పాత్రలని అందరూ చెబుతారు అలాంటిది ఇలా కామెడీగా చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ ఉండేది కానీ అనిల్ రావిపూడి గారు మీకెందుకు నేను ఉన్నాను కదా అంటూ నా చేత ఈ సినిమాలో నటింప చేశారని ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో కెరియర్ పరంగా నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అంటూ ఐశ్వర్య తెలిపారు. ఈ సినిమా తర్వాత నాకు చాలా అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి అంటే తెలియని ఐశ్వర్య రాజేష్ ఆయనతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటం విశేషం.
Also Read: Aishwarya Rajesh: సినిమాలలోకి రాకముందు ఐశ్వర్య రాజేష్ అలాంటి పనులు చేశారా?