E-Paper
Advertisement

Aishwarya Rajesh: సినిమాలలోకి రాకముందు ఐశ్వర్య రాజేష్ అలాంటి పనులు చేశారా?

Aishwarya Rajesh: సినిమాలలోకి రాకముందు ఐశ్వర్య రాజేష్ అలాంటి పనులు చేశారా?
Advertisement

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ ప్రముఖ దివంగత నటుడు రాజేష్(Rajesh) వారసురాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఐశ్వర్య రాజేష్ కుటుంబంలో వరస విషాదాలు జరిగిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి తన తండ్రి మరణించడం పెద్దయిన తర్వాత తన ఇద్దరు అన్నయ్యలు వరుసగా ప్రమాదాలలో మరణించిన విషయం తెలిసిందే.

పాకెట్ మనీ కోసం చిన్న ఉద్యోగం..

చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో తన అమ్మ ఎంతో కష్టపడి అందరిని చదివించిందని ఇలా మమ్మల్ని చదివించడం కోసం అమ్మ ఎంతో కష్టపడిందని తెలిపారు. ఇలా అమ్మ కష్టం చూసి తాను కూడా ఇంటర్ చదివే సమయంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నా పాకెట్ మనీ నేను సంపాదించుకొని అమ్మకు కాస్త సహాయంగా ఉండేదాన్ని తెలిపారు. ఇంటర్ చదువుతున్న సమయంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేయడం బర్తడే పార్టీలు ఇలాంటి వాటిలో పనిచేయటం వల్ల నాకు 250, 500 ఇచ్చేవారని, ఈ విధంగా నా పాకెట్ మనీ నేనే సంపాదించుకునే దానినంటూ ఐశ్వర్య రాజేష్ తెలిపారు.

అవకాశాలు ఆగిపోయాయి..

Advertisement

ఇక కాలేజీ చదువుతున్న సమయంలోనే డాన్స్ కాంపిటీషన్ వంటి వాటిలో కూడా పర్ఫార్మెన్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకున్నానని ఈమె తెలియజేశారు. ఇక పెరిగి పెద్దయిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో తెలుగు తమిళంలో ఎన్నో సినిమాలలో నటించిన తనకు ఒకానొక సమయంలో సినిమా అవకాశాలే రాకుండా పోయాయి, ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డానని ఐశ్వర్య రాజేష్ తెలిపారు.

ఏడాది అవకాశాలు లేవు..

Advertisement

ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ముందు ఒక ఏడాది వరకు నాకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ సమయంలో నా కెరియర్ ఇంతటితో ఆగిపోతుందా అనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి సక్సెస్ కావడంతో తనకు కెరియర్ పరంగా కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని ఈ సినిమా ద్వారా విదేశాలలో కూడా నన్ను గుర్తు పడుతున్నారని తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఐశ్వర్య రాజేష్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×