E-Paper
Advertisement

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Demonte Colony 3: ఒకప్పుడు భారీతారాగణం ఉంటే సినిమా సూపర్ హిట్ అందుకునేది.. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుడి అభిరుచి.. సినిమాను చూసే తీరు పూర్తిగా మారిపోయింది. కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు విభిన్నమైన జానర్ లలో.. అద్భుతమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు దర్శకులు. అలా మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలకే కాకుండా హార్రర్ జానర్ మూవీలకి కూడా అభిమానులు పట్టం కడుతున్నారు. అందుకే ఇటు నటీనటులు కూడా హార్రర్ జానర్ ని ఎంచుకుంటూ తమలోని కొత్త నటనను వెలికితీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.

విడుదలకు సిద్ధమవుతున్న డిమోంటీ కాలనీ 3..

అలా ఇప్పటికే హార్రర్ థ్రిల్లర్ జానర్ లో ప్రత్యేకమైన పేరు లిఖించుకున్న తమిళ చిత్రం డిమోంటీ కాలనీ. ప్రియా భవాని శంకర్, అరుళ్ నిధి జంటగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక దానిని మించి మరొకటి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సీక్వెల్ గా మూడవ భాగాన్ని కూడా మేకర్స్ ప్రకటించేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. గత రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు కథను సమకూర్చి, దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ అధినేత సుధన్ సుందరం తో కలిసి మనీష్ సింఘాల్, దుర్గా రామ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

also read:ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ మూవీ!

ఒకరోజు ముందుగానే భయపెట్టడానికి సిద్ధం..

ఇకపోతే సినిమాపై అంచనాలు పెంచుతూ విడుదల చేసిన ప్రతి పోస్టర్ సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ గత నెల 26వ తేదీన అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ లో ఒకరైన సుధన్ సుందరం మాట్లాడుతూ..” ఈ సిరీస్ లో మొదటి రెండు భాగాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీయడం అంత సులభం కాదు.. డిమోంటి కాలనీలో దర్శకుడు దానిని సాధ్యం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హీరో, దర్శకుడు ఎంతో బాధ్యత , అంకితభావంతో పనిచేశారు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెడతామంటూ” వివరించారు.

సెన్సార్ పూర్తి..

Advertisement

అయితే ఇప్పుడు ప్రేక్షకులు సెప్టెంబర్ 11 కోసం ఆత్రుతగా ఎదురు చూడగా.. మరో సర్ప్రైజ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు మేకర్స్. ఒకరోజు ముందుగానే అనగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. “డిమోంటి కాలనీ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఈ హార్రర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 3 సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్న డిమోంటి కాలనీలో సెప్టెంబర్ 10న చీకటి తిరిగి రాబోతోంది. గుండె ధైర్యంతో సిద్ధంగా ఉండండి” అంటూ కొత్త తేదీ ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కాగా.. ఏ (A)సర్టిఫికెట్ లభించినట్లు మేకర్స్ తాజాగా స్పష్టం చేశారు. ఇక మొత్తానికి అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా.. హార్రర్ ప్రియులకు మరింత ఆసక్తిగా ఉండనుంది అని తెలుస్తోంది.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×