E-Paper
Advertisement

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?
Advertisement

Loud Phone Speakers in Public: బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు హెడ్‌ ఫోన్లు ఉపయోగించకుండా ఫోన్‌ లో పెద్దగా సౌండ్ పెట్టి పాటలు, వీడియోలు చూస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగినా పట్టించుకోరు. ఇటీవల ఈ అలవాటు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటంతో దీనిపై పలు దేశాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ అలవాటును మాన్పించే దిశగా కీలక చర్యలు చేపడుతున్నాయి.

గట్టిగా పాటలు వింటే భారీ జరిమానా

ఐర్లాండ్‌లోని ఐరిష్ రైల్ సంస్థ రైళ్లలో పెద్ద శబ్దంతో ఫోన్ చూసే వారికి 100 యూరోల వరకు జరిమానా విధించే నిబంధన తీసుకొచ్చింది. అలాగే ప్రయాణికులు తప్పనిసరిగా ఇయర్‌ ఫోన్లు ఉపయోగించాలని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి అలవాటును నియంత్రించేందుకు కఠిన నిబంధనలను తీసుకొచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి. లండన్‌లో ప్రజా రవాణా ఉపయోగించే వారికి హెడ్‌ ఫోన్లు ధరించాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.

సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే?

Advertisement

ఈ సమస్యకు ప్రధాన కారణం సామాజిక నియమాల్లో వస్తున్న మార్పులేనని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు బహిరంగ ప్రదేశాల్లో నిశ్శబ్దంగా ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం సాధారణ మర్యాదగా భావించేవారు. ఇప్పుడు కొందరు అలాంటి నియమాలను పట్టించుకోవడం లేదు. దీంతో తమకు నచ్చిన కంటెంట్‌ ను ఇతరుల గురించి ఆలోచించకుండా గట్టిగా వినడం సాధారణ విషయంగా మారుతోంది.

సమాజంలో కొన్ని ప్రవర్తనలు లిఖితపూర్వకంగా ఉండవని.. ఎవరూ ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరూ పాటిస్తారని లిమరిక్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ నిపుణులు వెల్లడించారు. కానీ, కొందరు వాటిని ఉల్లంఘించడం మొదలుపెడితే, మిగతావారికి కూడా అది సాధారణంగా కనిపించే అవకాశం ఉంటుందన్నారు. అదే ఇప్పుడు ప్రజా రవాణాలో కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకొచ్చారు.

స్మార్ట్‌ ఫోన్లతో ఇయర్‌ ఫోన్లు ఇవ్వకపోవడం

Advertisement

ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే, ప్రస్తుతం చాలా స్మార్ట్‌ ఫోన్లతో పాటు ఇయర్‌ ఫోన్లు ఇవ్వడం లేదు. దీంతో చాలామంది ప్రత్యేకంగా కొనకుండా ఫోన్ స్పీకర్‌ పైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కూడా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద శబ్దంతో వీడియోలు చూడటం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. కోవిడ్ తర్వాత ప్రజల ప్రవర్తనలో కూడా కొంత మార్పు వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకపోవడం లాంటి ధోరణి పెరిగిందని వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రయాణికులు అసౌకర్యంగా భావించినా, సౌండ్ తగ్గించమని చెప్పడానికి వెనుకాడుతుంటారు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల గొడవ జరిగే అవకాశం ఉంటుందని భావిస్తారు. దీంతో ఇబ్బంది పడినా మౌనంగా ఉండిపోతారు.

యువతలో సోషల్ మీడియా వీడియోలను కలిసి చూడటం లేదా బిగ్గరగా ప్లే చేయడం కొంతమందికి సహజంగా అనిపించవచ్చు. అలాంటి ప్రవర్తనను తరచూ చూసే కొద్దీ అది కూడా ఒక కొత్త సామాజిక అలవాటుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే హెడ్‌ఫోన్లు ఉపయోగించడం, ఫోన్ శబ్దాన్ని తగ్గించడం వంటి చిన్న మర్యాదలు పాటిస్తే మనతో పాటు ఇతరుల ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు.

Read Also: శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్ నుంచి గంటలోనే ప్రయాణం!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×