E-Paper
Advertisement

Ajith Kumar: చిన్న పిల్లాడి షూ-లేస్ కట్టిన అజిత్… ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Ajith Kumar: చిన్న పిల్లాడి షూ-లేస్ కట్టిన అజిత్… ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Advertisement

Ajith Kumar: నటుడు అజిత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంత చేసుకున్న అజిత్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నటుడు అజిత్ కు సినిమాలు మాత్రమే కాకుండా రేసింగ్ అంటే కూడా ఎంతో ఇష్టమైన విషయం మనకు తెలిసిందే. రేసింగ్ అంటే పిచ్చి ఉన్న ఈయన వివిధ దేశాలలో రేసింగ్ పోటీలలో పాల్గొంటూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటీవల దుబాయ్ లో జరిగిన రేసింగ్ పోటీలలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.జనవరి 10-12 తేదీలలో జరిగిన 24H దుబాయ్ సిరీస్‌ (24H dubai series)లో అజిత్ కుమార్ (Ajith Kumar)పాల్గొన్నారు.

అభిమానికి షూ -లేస్ కట్టిన అజిత్..

ఈ రేసింగ్ పోటీలలో భాగంగా అజిత్ బృందం 992 విభాగంలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇలా ఈ రేసింగ్ పోటీలలో అజిత్ బృందానికి మూడవ స్థానంలో చోటు దక్కడంతో ఈయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రేసింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఒక వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ రేసింగ్ సిరీస్ లో భాగంగా అజిత్ కుమార్ ఒక చిన్న పిల్లాడికి షూ – లేస్ (shoelace)కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు అజిత్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు.

గొప్ప మనసు ఉండాలి..

Advertisement

అజిత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు .ఇక రేసింగ్ లో కూడా ఈయన అదే స్థాయిలో ఆదరణ పొందారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి చిన్న పిల్లాడికి షూ – లేస్ కట్టడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పని చేయాలంటే గొప్ప మనసు ఉండాలని అజిత్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ఈయన ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తర్వాత తన తదుపరి సినిమాని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇటీవల ఈ సినిమా గురించి డైరెక్టర్ అప్డేట్ ఇస్తూ.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని, ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ సర్చ్ చేస్తున్నామని తెలియజేశారు. ఈ సినిమాని ఫిబ్రవరి నెలలో అధికారకంగా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారకంగా తెలియజేయబోతున్నారు. ఇక ఈ సినిమా అజిత్ కెరియర్లో 64 వ సినిమా కావటం విశేషం.

Also Read: Om Shanthi Shanthi Shanthi: తరుణ్ భాస్కర్ ఓంశాంతి శాంతి శాంతి వాయిదా..కొత్త రిలీజ్ ఎప్పుడంటే!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×