E-Paper
Advertisement

Varanasi: వారణాసి నుండి క్రేజీ అప్డేట్.. రూమర్స్ కి చెక్ పెడుతూ వీడియో రిలీజ్!

Varanasi: వారణాసి నుండి క్రేజీ అప్డేట్.. రూమర్స్ కి చెక్ పెడుతూ వీడియో రిలీజ్!
Advertisement

Varanasi:టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli )నుంచి వచ్చే సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ‘ ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచ స్థాయి అభిమానులను సొంతం చేసుకున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి ఎలాంటి సబ్జెక్టు రాబోతోంది అనే ఆలోచన అందరిలో మొదలైంది. ఇకపోతే అంతర్జాతీయ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ‘వారణాసి’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కేల్ నారాయణ సుమారుగా 1200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విడుదల తేదీ పై రూమర్స్..

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇకపోతే గత రెండు నెలల క్రితం హైదరాబాదులో జరిగిన గ్లోబ్ ట్రోటర్ అనే గ్రాండ్ ఈవెంట్ ద్వారా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే చర్చ నడుస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం రిలీజ్ డేట్ గురించి ఇంత ముందే మాట్లాడడంపై కొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2027 సమ్మర్ కి ఈ సినిమాను రిలీజ్ చేస్తారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వారణాసి చిత్ర బృందం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది.

Advertisement

also read:Tollywood: రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిన చిరంజీవి హీరోయిన్!

మళ్లీ క్లారిటీ ఇచ్చిన చిత్రం బృందం..

ఇకపోతే రిలీజ్ డేట్ విషయంలో కూడా ముందస్తు ప్లానింగ్ తో వెళ్తున్న రాజమౌళి టీం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. వారణాసి 2027 లోనే రిలీజ్ అవుతుంది అంటూ అధికారికంగా ప్రకటించింది. ఇక మొత్తానికైతే ఇప్పటికే ఈ సినిమా విడుదలపై వస్తున్న ఊహాగానాలకు పెద్ద ఎత్తున పులిస్టాప్ పడినట్టు అయింది. సాధారణంగా రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి రావు అనే అనుభవం తెలుగు ప్రేక్షకులకు చాలా ఉంది. అందుకే 2027 రిలీజ్ అంటే చాలామంది నెటిజన్స్ కూడా ఇంకా నమ్మడం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తం అవడంతోనే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

పరిశీలనలో శ్రీరామనవమి..

Advertisement

మరోవైపు ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9 శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. పైగా ఈ విషయాన్ని ఈ ఏడాది మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు కాసేపు రాముడి పాత్రలో కనిపించబోతుండడం వల్లే ఈ డేట్ లో విడుదల తేదీ ప్రకటిస్తారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కూడా మహేష్ బాబు నటిస్తున్నారు. కాబట్టి మహాశివరాత్రి రోజు అయినా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వదులుతారేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మరి చూడాలి రాజమౌళి ప్లాన్ ఏ విధంగా ఉందో..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×