E-Paper
Advertisement

Akhanda 2: ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. త్రిబుల్ ట్రీట్.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే

Akhanda 2:  ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. త్రిబుల్ ట్రీట్.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే
Advertisement

Akhanda 2: ఈ మధ్యకాలంలో అభిమానులను సర్ప్రైజ్ చేస్తూనే.. లాభం పొందడానికి నిర్మాతలు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్లను సినిమాలలో పెట్టి కోట్ల రూపాయలు ఘడించడమే కాకుండా వీరి ఫోటోలను ఉపయోగించి 3డి రూపంలో సినిమాలను రిలీజ్ చేస్తూ ఇటు ఆడియన్స్ కి అద్భుతమైన ట్రీట్ ఇవ్వడమే కాకుండా నిర్మాతలు కూడా లాభపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ‘మహావతార నరసింహ’ సినిమా ఎటువంటి తారాగణం లేకుండా కేవలం 3d యానిమేషన్ రూపంలో తెరకెక్కి వందల కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. అలాగే ఇటీవల రీ రిలీజ్ అయిన ‘ బాహుబలి ది ఎపిక్ ‘ కూడా త్వరలో 3d యానిమేషన్ తో రాబోతోంది అని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం..

ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య బోయపాటి శ్రీను కూడా అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఏకంగా 3D రూపంలో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించి అసలు విషయాన్ని తెలియజేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. బోయపాటి శ్రీను (Boyapati Srinu), బాలకృష్ణ (Balakrishna) తాజాగా నటిస్తున్న చిత్రం అఖండ 2 . అఖండ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే “అఖండ తాండవం” అంటూ ఇటీవల ముంబైలో సాంగ్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి మరీ సినిమాపై అంచనాలు పెంచేశారు. దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉండగా.. ఇప్పుడు మరో అనౌన్స్మెంట్ చేసింది చిత్రం బృందం.

Advertisement

also read:Rashmika Mandanna: మగాళ్లకు పీరియడ్స్ రావాలి.. రష్మిక మాటలకు డాక్టర్ రియాక్షన్!

త్రీడీ ఫార్మాట్లో కూడా రిలీజ్..

ఈ క్రమంలోనే అఖండ 2 సినిమాని 3D ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమంలోనే గొప్ప ఎక్స్పీరియన్స్ ను పంచే సినిమాలలో ఇదొకటి కానుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ అఖండ 2 బిగ్ రివీల్ అంటూ ప్రకటన చేసింది. దీనితో హైపు మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఇకపోతే హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలను ఇప్పటికే సాంగులో , గ్లింప్స్ లో చూపించారు . వీటిని 3d ఫార్మాట్లో చూస్తే ఇంకేమైనా ఉంటుందా మహా అద్భుతం అని చెప్పవచ్చు. మొత్తానికైతే మేకర్స్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

అఖండ 2 సినిమా విశేషాలు..

Advertisement

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా సీక్వెల్ గా అఖండ 2 వస్తుండగా.. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి అఘోర పాత్ర కాగా మరొకటి మురళీకృష్ణ పాత్ర.. బాలయ్య అఖండ రుద్ర తాండవం నుంచి బ్లాస్టింగ్ రోర్ వరకు రెండు పాత్రలలో చెప్పిన డైలాగ్స్ యాక్షన్ వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×