Ipl 2026: డిసెంబర్ 16న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 కి సంబంధించిన మినీ వేలం జరగబోతోంది. ఇందులో భాగంగా నెల రోజుల ముందే ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ ని విడుదల చేశాయి. నవంబర్ 15 రోజున మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేశాయి. ఇందులో కొన్ని జట్లు కొంతమంది కీలక ఆటగాలను వదులుకున్నాయి. వీరిలో ముఖ్యంగా ఐదుగురు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేయడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Shubman Gill: గిల్ మెడ నొప్పిపై ట్రోలింగ్… నీ కంటే లేడీస్ బెటర్ అంటూ!
ఆండ్రీ రస్సెల్: 2026 ఐపీఎల్ కి ముందు కలకత్తా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఆల్రౌండర్ రస్సెల్ ని కలకత్తా రిటైన్ చేసుకోలేదు. గత సీజన్ కి ముందు ఇతడిని మెగా వేలంలో 12 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు అతడిని జట్టులో కొనసాగించకుండా వేలానికి వదిలేసింది. భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్.. కలకత్తా నైట్ రైడర్స్ లో చేరాడు. ఎన్నో మ్యాచ్లలో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 2014, 2024 లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత సీజన్ లో ఇతడి నుంచి అటు బౌలింగ్ లోను, ఇటు బ్యాటింగ్ లోను మెరుగైన ప్రదర్శన రాలేదు. ఈ కారణంగానే కేకేఆర్ ఇతడిని రిలీజ్ చేసినట్లు భావిస్తున్నారు.
మతీషా పతిరనా: గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యంగా జూనియర్ మలింగ గా పిలుచుకునే మతీషా పతిరనా.. డేట్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ఎక్కువగా వైడ్లు వేసి అత్యధిక పరుగులు ఇచ్చాడు. నాథన్ ఎల్లీస్ ని పక్కన పెట్టి మరీ ఇతడికి అవకాశం ఇస్తే దుర్వినియోగం చేసుకున్నాడు. 2022 ఐపిఎల్ సీజన్ తో చెన్నై సూపర్ కింగ్స్ లో అడుగుపెట్టిన ఇతడు.. డెత్ ఓవర్లలో అత్యధికంగా వికెట్లు పడగొడుతూ ఆ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇతడిని గత సీజన్ లో 13 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై. కానీ గత సీజన్ లో అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఇత్తడిని సిఎస్కే రిలీజ్ చేసింది.
లియామ్ లివింగ్ స్టోన్: 2026 ఐపిఎల్ సీజన్ కి ముందు ఆర్సిబి కూడా కీలక ఆటగాళ్లని రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యంగా పవర్ హిట్టర్, ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ ని రిలీజ్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 2025 ఐపీఎల్ మెగా యాక్షన్ లో ఇతడిని భారీ ధర {8.75} కి కొనుగోలు చేసింది బెంగుళూరు. కానీ ఇతడు ఘోరంగా విఫలమయ్యాడు. పది మ్యాచ్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అటు బౌలింగ్ లో కూడా పెద్దగా రాణించలేదు. దీంతో ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ ని రిలీజ్ చేసి మినీ యాక్షన్ కి ముందు ఆర్సిబి అభిమానులకు షాక్ ఇచ్చింది యాజమాన్యం.
జోష్ ఇంగ్లిస్: పంజాబ్ కింగ్స్ రిటెన్షన్ జాబితా చూసి కూడా అంతా ఆశ్చర్యపోతున్నారు. గత సీజన్ లో అద్భుతంగా రాణించిన జోష్ ఇంగ్లీస్ ని విడుదల చేసింది పంజాబ్. ఇతడు గత ఎడిషన్ లో ఐపీఎల్ లోకి చేరాడు. 2025 మెగా వేలంలో ఇతన్ని 2.6 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్. ఇక ఇతడు ఆడిన 11 మ్యాచులలో 162.57 స్ట్రైక్ రేటుతో 278 పరుగులు చేశాడు. తన పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ని ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగలడు. అలాంటి ఇంగ్లీస్ ని పంజాబ్ వేలంలోకి వదిలేసింది.
Also Read: IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేకర్.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే
రవి బిష్ణోయ్: లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని 2025 మెగా వేలంలో ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. కానీ 2026 ఐపీఎల్ మినీ వేళానికి ముందు ఇతడిని విడుదల చేసింది. గత సీజన్ లో ఇతడి పేలవ ప్రదర్శన కారణంగానే లక్నో ఈ నిర్ణయం తీసుకుంది. ఇతడు గత సీజన్ లో 14 మ్యాచ్లలో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ఇతడిని రిలీజ్ చేసి.. మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉంది లక్నో.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">