E-Paper
Advertisement

Rashmika Mandanna: మగాళ్లకు పీరియడ్స్ రావాలి.. రష్మిక మాటలకు డాక్టర్ రియాక్షన్!

Rashmika Mandanna: మగాళ్లకు పీరియడ్స్ రావాలి.. రష్మిక మాటలకు డాక్టర్ రియాక్షన్!
Advertisement

Rashmika Mandanna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా మారడమే కాకుండా ఆ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ.. బాక్సాఫీస్ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది. అందంతో అద్భుతమైన నటనతో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక.. ఇటీవల ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ హీరో కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) కూడా కీలకపాత్ర పోషించారు.

మగాళ్లకు పీరియడ్స్ రావాలి..

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొనింది రష్మిక మందన్న.. అందులో భాగంగానే జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి హాజరైన రష్మిక..” మగాళ్ళకి కూడా పీరియడ్స్ రావాలి..” అంటూ సంచలన కామెంట్లు చేసింది. అయితే ఈ విషయం వైరల్ అవ్వడంతో దీనిపై ఓ ప్రముఖ డాక్టర్ స్పందించారు. వారి మాటలకు నెటిజన్స్ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

డాక్టర్ అదిరిపోయే సమాధానం..

Advertisement

“మగాళ్లకు పీరియడ్స్ రావాలి అలా వస్తే స్త్రీల బాధేంటో తెలిసేది” అని రష్మిక కామెంట్లు చేయడంతో ఆ వ్యాఖ్యలకు ఒక డాక్టర్ స్పందిస్తూ.. అమ్మాయిగా పుట్టడం ఒక వరం.. పీరియడ్స్ వల్లే సృష్టి కూడా నిలుస్తుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టేరాన్ హార్మోన్స్ వల్ల PMS (Pre Menstrual syndrome) సింటమ్స్ వస్తాయి. అయితే ఈ హార్మోన్స్ అమ్మాయిలలోనే కాదు అబ్బాయిలలో కూడా ఉంటాయి. వీటివల్ల వారిలో నిద్ర, శక్తి, వారి మూడ్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అమ్మాయిలకు ప్రతినెల పీరియడ్స్ ఎలా అయితే వస్తాయో.. అబ్బాయిల్లో కూడా ప్రతి నెల ఇలాంటి హార్మోన్స్ వల్ల డిస్టబెన్స్ ఏర్పడుతుంది. ఆ సమయంలో వారు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు” అంటూ డాక్టర్ క్లారిటీగా వివరణ ఇచ్చారు. మొత్తానికైతే రష్మిక ఇచ్చిన కామెంట్లకు డాక్టర్ ఇచ్చిన రియాక్షన్ అదుర్స్ అంటూ నెటిజన్స్ , అబ్బాయిలు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

also read:(Image source: Instagram)

రష్మిక మందన్న సినిమాలు..

Advertisement

రష్మిక మందన్న సినిమాల విషయానికొస్తే.. కన్నడ బ్యూటీ అయిన ఈమె తెలుగులో ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన రష్మిక.. ఆ తర్వాత పుష్ప , పుష్ప 2, యానిమల్, సికందర్, ఛావా, కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాలతో భారీ సక్సెస్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలతో నాలుగు వేల కోట్లకు పైగా కలెక్షన్లు వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పాపులారిటీ అందుకుంది ప్రస్తుతం మైసా, రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×