E-Paper
Advertisement

Akhanda 2 Collections : ‘అఖండ2’ కు బిగ్ షాక్.. దారుణంగా పడిపోయిన వీకెండ్ కలెక్షన్స్..!

Akhanda 2 Collections : ‘అఖండ2’ కు బిగ్ షాక్.. దారుణంగా పడిపోయిన వీకెండ్ కలెక్షన్స్..!
Advertisement

Akhanda 2 Collections : టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం అఖండ 2.. ఈనెల 12న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ హిట్ కాంబినేషన్లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి.. కానీ రీసెంట్ గా వచ్చిన అఖండ 2 మాత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.. మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంటూ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. మౌత్ టాక్ పర్వాలేకున్నా కలెక్షన్స్ మాత్రం రోజురోజుకు తగ్గుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. వీకెండ్ ఈ మూవీ కలెక్షన్స్ ఏ మాత్రం పెరిగాయో ఒకసారి తెలుసుకుందాం..

‘అఖండ 2’ వీకెండ్ కలెక్షన్స్..

గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాను తెరకెక్కించి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. అంతా బాగానే ఉందని అనుకున్నారు, అయితే డిసెంబర్ 5 న సినిమా పోస్ట్ పోన్ అవ్వడం మైనస్ అయ్యింది. 12 న థియేటర్లలోకి సినిమా వచ్చింది. కానీ టాక్ దెబ్బేసింది. మొదటి రోజు కలెక్షన్స్ కేవలం 32 కోట్లు వసూల్ అయ్యాయి. వీకెండ్ సినిమా కలెక్షన్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. ఈ వీకెండ్ పెద్దగా కలిసి రాలేదు.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 65 కోట్లు మాత్రమే రాబట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అఖండ 2 కు ఇంత తక్కువ రావడంతో ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరో వారం అయిన కలెక్షన్స్ భారీగా వస్తాయేమో చూడాలి..

Advertisement

Also Read : శ్రీవల్లికి కాలరాత్రి.. నిజం చెప్పిన తిరుపతి.. పూటుగా తాగేసిన శ్రీవల్లి..

అఖండ 2 బడ్జెట్ & టార్గెట్..? 

బాలయ్య సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం పక్కా. అందులో అఖండ లాంటి సినిమాలకు సీక్వెల్ గా రావడం అంటే ఇక చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా వచ్చిన అఖండ 2 భారీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చుల తో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో నిర్మించారు.. అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం కలెక్షన్స్ పడిపోతున్నాయి.. మరి ఇలా అయితే బ్రేక్ ఈవెన్ రాబట్టడం కష్టమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు నష్టాలు తప్పేలా కనిపించట్లేదు.. ఈనెల 25 వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ అయినా కలెక్షన్స్ కాస్త మెరుగ్గా ఉంటాయేమో చూడాలి..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×