E-Paper
Advertisement

Akhanda 2 : కట్టాల్సింది 70 కోట్లు కాదు.. 90 కోట్లు.. తవ్వేకొద్ది బయట పడుతున్న నిర్మాతల బొక్కలు

Akhanda 2 : కట్టాల్సింది 70 కోట్లు కాదు.. 90 కోట్లు.. తవ్వేకొద్ది బయట పడుతున్న నిర్మాతల బొక్కలు
Advertisement

Akhanda 2 : ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అఖండ2(Akhanda 2) సినిమా విడుదల వాయిదా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావలసి ఉండగా ఫైనాన్స్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది ఈ సినిమా కోసం ముగ్గురు ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని ఈ సినిమాని భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించారు.

రూ.70 కాదు 90 కోట్లు చెల్లించాలి..

ఇలా ఈ ముగ్గురు ఫైనాన్షియర్లకు నిర్మాతలు సుమారు 70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని ఆ 70 కోట్లు చెల్లించే వరకు సినిమా విడుదలకు అనుమతి తెలుపము అంటూ అడ్డుపడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ విషయం గురించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. నిర్మాతలు ఫైనాన్షియరులకు చెల్లించాల్సింది 70 కోట్లు కాదని 90 కోట్లు అని తెలుస్తోంది. ఇలా తవ్వే కొద్ది నిర్మాతలు చేసిన అప్పులు బయటపడుతున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు కూడా కంగారు వ్యక్తం చేస్తున్నారు.

డిసెంబర్ నెలలో ఆఖండ 2 రావడం కష్టమేనా?

Advertisement

ఇలా ఉన్నఫలంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలి అంటే ఎంతో కష్టతరమైన పనని చెప్పాలి. అయితే డబ్బులు చెల్లించే వరకు సినిమా విడుదలకు అనుమతి లేదనే విషయం తెలియడంతో డిసెంబర్ నెలలో బాలకృష్ణ సినిమా రావటం కష్టమే అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.. డిసెంబర్ నెలలో కనుక ఈ సినిమా విడుదల కాకపోతే అఖండ సినిమా మరికొన్ని నెలల పాటు వాయిదా పడుతుందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటించాయి.

2026 సమ్మర్ లోనే అఖండ 2?

Advertisement

జనవరి నెలలో ఈ సినిమా విడుదలకు ఎలాంటి అవకాశం లేదు ఇక ఫిబ్రవరి మార్చి నెలలో కూడా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా తిరిగి 2026 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ లాంటి ఒక స్టార్ హీరో సినిమాకు ఇలాంటి ఇబ్బందులు రావడంతో అభిమానులు నిర్మాతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ సినీ కెరియర్ లో ఈ సినిమా 110 సినిమా కావటం విశేషం.అలాగే బాలయ్య కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు సంతోషపడ్డారు. అయితే ఈ సినిమా విడుదలకు ఇలాంటి అడ్డంకులు ఎదురవడంతో అభిమానులు నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Akhanda 2 -Venu Swamy: అఖండ 2 వాయిదాకు కారణం నీ పూజలే… వేణు స్వామీ మీద పడ్డ బాలయ్య అభిమానులు

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×