E-Paper
Advertisement

Sunil Gavaskar: హ‌ర్షిత్ రాణా, ప్రసిద్ ల‌ను ఆడిస్తే, 500ల టార్గెట్ పెట్టినా ఓడిపోతాం

Sunil Gavaskar: హ‌ర్షిత్ రాణా, ప్రసిద్ ల‌ను ఆడిస్తే, 500ల టార్గెట్ పెట్టినా ఓడిపోతాం
Advertisement

Sunil Gavaskar: భారత్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డే అభిమానులను ఎంతగానో అలరించింది. మొదటి వన్డేలో భారత్ పై 17 పరుగుల తేడాతో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా.. రెండవ వన్డేలో సూపర్ విక్టరీ అందుకుంది.

Also Read: Mysterious Lady: అందమైన భామతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇంతకీ ఎవరీ అందాల తార?

Advertisement

భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండవ వన్డేలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించడంతో.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇరుజట్లు 1-1 సమానంగా నిలిచాయి. ఇక సిరీస్ విజేత డిసెంబర్ 6న విశాఖపట్నం వేదికగా జరిగే మూడవ వన్డే ద్వారా తేలనుంది.

 

అత్యంత బలహీనంగా బౌలింగ్ విభాగం:

Advertisement

ఒక వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని చేదించడం ఏ జట్టుకైనా అంత సులభమైన విషయం కాదు. ఒకవేళ అలా చేదించిందంటే ప్రత్యర్థి జట్టు బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉందని అర్థం. భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండవ వన్డేలో ఇదే జరిగింది. భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా ఇద్దరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఇద్దరి బౌలింగ్ చూసిన ప్రతి అభిమాని కూడా అసలు ఎందుకు జట్టులో ఉన్నారు అని అనుకుంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు ఒకరు ప్రసిద్ద్ కృష్ణ, మరొకరు హర్షిత్ రానా. రెండవ వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకవేళ ప్రసిద్ద్ 10 ఓవర్లు వేసి ఉంటే సెంచరీ కొట్టేవాడే. ఇతని ఎకానమీ రేటు 10.20 గా ఉండడం గమనార్హం. ఈ మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా నిలిచాడు ప్రసిద్ద్. మరోపక్క హర్షిత్ రాణా కూడా 10 ఓవర్లలో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వీరిద్దరిని మూడవ వన్డే నుంచి తొలగించాలనే డిమాండ్స్ వస్తున్నాయి.

 

500 టార్గెట్ అయినా వీరిద్దరు బౌలింగ్ వేస్తే ఓడిపోతాం:

రెండవ వన్డేలో ఈ ఇద్దరు బౌలర్ల పేలవమైన ప్రదర్శన తర్వాత.. వీరి కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడిందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. మహమ్మద్ షమీ వంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని.. అతడు ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఆడి ఉంటే టీమిండియా బౌలింగ్ దాడి గణనీయంగా బలంగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు.

Also Read: Travis Head: తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టిన హెడ్.. వీడికి ఎప్పుడు మగాళ్లపైన పిచ్చి

అయితే రెండవ వన్డేలో వీరిద్దరి బౌలింగ్ ప్రదర్శనపై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జట్టులో ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా వంటి బౌలర్లు ఉన్నప్పుడు.. టీమిండియా 500 పరుగులు చేసినా లాభం లేదని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించినట్లుగా ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో ఈ మీమ్ ప్రస్తుతం క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో కొంతమంది నెటిజన్లు భారత బౌలర్ల ప్రదర్శన పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఈ న్యూస్ ని షేర్ చేస్తున్నారు. అలాగే ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా కంటే బెటర్ బౌలర్లు జట్టులో లేరా..? అనే ప్రశ్నను బీసీసీఐ సెలెక్టర్లకు అభిమానులు సంధిస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by 🔱 (@ryuzakiii.exeeeeee)

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×