E-Paper
Advertisement

Akhanda 2 Thaandavam Trailer: దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం

Akhanda 2 Thaandavam Trailer: దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం
Advertisement

Akhanda 2 Thaandavam Trailer: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 తాండవం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ ట్రైలర్ ను బెంగుళూరులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రిలీజ్ చేశాడు.

ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అఖండ కంటే తాండవం మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఈసారి దైవ భక్తికి.. దేశ భక్తిని కూడా జోడించారు. భారతదేశాన్ని నాశనం చేయడానికి కొందరు ప్రయత్నిస్తుండగా.. దాన్ని అడ్డుకోవడానికి అఖండ ఏం చేశాడు అనేది కథగా తెలుస్తోంది.కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి.. కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. బాలయ్య నట విశ్వరూపం అని చెప్పొచ్చు. కుటుంబం ఆపదలో ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్పిన అఖండ.. తమ్ముడు కూతురు ఆపదలో ఉందని తెలుసుకొని మళ్లీ తిరిగి వచ్చినట్లు చూపించారు.

Advertisement

ఇక తాంత్రీయ శక్తులకు అధిపతిగా ఆది పినిశెట్టి నటించాడు.తన శక్తితో దేశాన్ని నాశనం చేసేవారికి సహాయం చేస్తూ ఉంటాడు. దాన్ని అడ్డుకోవడానికి అఖండ చేసే యుద్ధమే అఖండ 2 లో చూపించాడు బోయపాటి. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు.  ఒక పక్క దైవం.. ఇంకోపక్క దెయ్యం.. ఈ రెండిటి మధ్య యుద్ధం అదిరిపోయింది. ఇక విజువల్స్ పరంగా కళ్ళు చెదిరేలా ఉన్నాయని చెప్పొచ్చు. వీటన్నింటికి తోడు థమన్ మ్యూజిక్.. ఈసారి కూడా థియేటర్స్ లో సౌండ్స్ బద్దలవ్వడం ఖాయమనిపిస్తుంది. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×