Akhanda 2: నందమూరి హీరో బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.. ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. కానీ నాల్గవ సినిమాగా వచ్చిన అఖండ 2 మాత్రం చతికిలపడింది.. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్ గా మిగిలింది. యావరేజ్ టాక్ ని అందుకోడంతో పాటుగా కలెక్షన్లు కూడా అంతంది మాత్రం గానే వచ్చాయి. ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడిందో, అప్పుడు ఈ సినిమా గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. తద్వారా హైప్ కూడా ఏర్పడింది.. మొదటి షో నుంచి ఈ సినిమాకు టాక్ పూర్తిగా మారిపోయింది. దాంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. గతంలో బాలయ్య సినిమాకు ఎప్పుడు జరగని విధంగా ఈ సినిమాకు పరిస్థితులు ఒకదాని వెంట మరొకటి చుట్టుముట్టాయి. దాంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. ఇక ఈ మూవీ ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
గతంలో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 థియేటర్లలోకి వచ్చింది.. ఈ సినిమాకు మొదటినుంచి ఏదో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. చివరికి ఆ అడ్డంకులు ఆ సినిమాకు మైనస్ గా మారాయి. దాంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. 20 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, 19 కోట్ల 23 లక్షల షేర్ వసూళ్లు క్లోజింగ్ లో వచ్చాయి… ఇక్కడ మాత్రమే కాదు సీడెడ్ లో అత్యంత ఘోరంగా కలెక్షన్స్ రావడంతో క్లోజింగ్ కలెక్షన్స్ బాగా తగ్గాయి. 25 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ అన్ని కలిపి 12 కోట్లు వసూల్ చెయ్యడంతో ఈ మూవీ బిగ్ డిజాస్టర్ గా మారింది.
అఖండ 2 సినిమాకు కథ రోజులుగా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ప్రతి సారి ఈ సినిమాకు గండం తప్పకుండా వెంటాడుతూనే ఉంది. రిలీజ్ టైం లో కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల పోస్ట్ పోన్ అవడంతో పెద్ద మైనస్ అయింది. క్లోజింగ్ కలెక్షన్స్ పై నందమూరి అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఏ ఏరియాలో ఎన్నికోట్ల కలెక్షన్స్ వచ్చాయో చూస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంతం లో 5. 68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4. 36 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.38 కోట్లు, గుంటూరు జిల్లాలో 5.53 కోట్లు, కృష్ణాలో 3 కోట్లు,నెల్లూరు జిల్లాలో 2. 76 కోట్లు రాబట్టింది. ఓవరాల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 118 కోట్లు వసూల్ చేసింది.. ఈ మధ్య వచ్చిన బాలయ్య సినిమాలలో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారో చూడాలి.. ప్రస్తుతం బాలయ్య కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.