ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 31వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.
ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్దలు కలుగతాయి.
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటాబయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.
సకాలంలో పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో.ఆకస్మిక విజయం సాధిస్తారు. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.
ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దూరప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
వృత్తి ఉద్యోగాలు గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది. ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆదాయానికి ఇబ్బందులు తప్పవు. నూతన ఋణయత్నాలు నిదానంగా సాగుతాయి.
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికామౌతాయి.
వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి.
వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.