Akhil Trolls:అఖిల్ అక్కినేని..అక్కినేని లెగసీని కంటిన్యూ చేస్తూ అక్కినేని నాగార్ఝున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ కిడ్ ఎట్టకేలకి సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ని పువ్వుల్లో పెట్టి అందించింది లెనిన్.మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతూ కేవలం 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 88 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో కూర్చున్నా ఆశ్చర్యం లేదు.ఇక ఎప్పుడూ చూడనంటు వంటి సక్సెస్ ని ఆస్వాదిస్తున్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.
కలిసినప్పుడల్లా అయ్యగారంటూ ఆటపట్టిస్తారు
తను,తన ఫ్రెండ్స్ తో ఎక్కువగా పార్టీలకి వెళ్తుంటానని,అయితే అక్కడ తనని ఒక స్టార్ కిడ్ లా చూడకుండా అందరు ట్రోల్ చేస్తూ వేసుకుంటారని చెప్పుకొచ్చాడు.ముఖ్యంగా సోషల్ మీడియాలో అయ్యగారు అంటూ తన అభిమాని ఎప్పుడైతే తనని ఆకాశానికి ఎత్తుకున్నాడో అప్పటి నుంచి తన ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా అయ్యగారంటూ ఆటపట్టిస్తారని సరదాగా చెప్పుకొచ్చాడు.ఒక రకంగా ఆ అభిమాని తన పేరు మార్చేశాడని, ఇపుడు ఎక్కడికెళ్ళినా తనని అఖిల్ అనరని, అయ్యగారే అంటారని తెలిపాడు. ఇక ఆ అభిమాని తనని హత్తుకోవడం అసలెప్పుడు మరచిపోనని,తన తండ్రి ఇచ్చిన హాగ్ తర్వాత అంత మెమరబుల్ హాగ్ ఇదేనని ఎమోషనల్ అయ్యాడు.
తనపై వచ్చిన ట్రోల్స్ పై రియాక్ట్ అవుతూ
ఇక వరుస సినిమాలు ప్లాప్ అవుతుంటే సోషల్ మీడియాలో తనపైన సర్క్యులేట్ అయిన జోకులని తను కూడా సరదాగా తీసుకున్నానని , అంతే కాకుండా వాటినే తనే స్వయంగా తన ఫ్రెండ్స్ కి చూపించి ఎంజాయ్ చేశానని అసలు విషయం చెప్పుకొచ్చాడు.అయితే కెరీర్ మొదట్లో అఖిల్ ఫ్లాప్ అయితే అందరికి దూరంగా ఫ్రెండ్స్ తో వెకేషన్ కి పారిపోయానని,అదే ఇప్పుడైతే ఇక్కడే తెల్సిన వాళ్ళ మధ్యనే ఉంటూ ప్లాపులని ఎలా తీసుకోవాలో నేర్చుకుంటున్నాడని చెప్పాడు.
ఎవరెన్ని ట్రోల్స్ చేసినా తాను లైట్ తీసుకోవడమే
ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చే మీమ్స్, ట్రోల్స్ పై తను రియాక్ట్ అవుతాడో క్లారిటీ ఇచ్చేశాడు.తన మీద ఎవరెన్ని ట్రోల్స్ చేసినా తాను లైట్ తీసుకోవడమే అలవాటు చేసుకున్నానని, ఒకరకంగా మనం పబ్లిక్ లైఫ్ లో ఉంటున్నప్పుడు ఇవి తప్పవన్నాడు.సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళు ఎంతగా ఆదరిస్తారో,సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసినప్పుడు కూడా ప్యాన్స్ అలాగే ఎసుకుంటారని దానికి బాధపడాల్సిన అవసరం లేదని, ఆ మాత్రం హక్కు వాళ్ళకు ఉంటుందంటూ ట్రోల్స్ పై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు అఖిల్.
also read:పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
ఇక అఖిల్ లెనిన్ సినిమా విషయానికి బాగ్య శ్రీ బోర్సే జంటగా దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా జులై 10న రిలీజ్ అయి అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.ఎలాగైనా కొడుకు కెరీర్ నిలబెట్టాలని నాగ్ చేసిన ప్రయత్నం మొత్తానికి సక్సెస్ అయింది.చూడాలి మరి ఇదే సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ ఈ అయ్యగారు ముందు ముందు ఇంకెన్ని హిట్స్ ని ఖాతాలో వేసుకుంటాడో !