E-Paper
Advertisement

పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Big boss Tanuja Puttaswamy: సరికొత్తగా వచ్చే ఏ టెక్నాలజీతో అయినా ఎంత ప్లస్ ఉంటుందో అంతే మైనస్ ఉంటుంది.దాన్ని మనం ఎలా వాడుకున్నాం అనే దానిపైనే ఆధారపడిఉంటుంది.ఇక ఉవ్వెత్తున దూసుకొచ్చి పక్కకి జరపలేనంతగా పాతుకుపోయిన సోషల్ మీడియా కూడా అంతే. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఎన్నో అవకాశాలు,మరెంతో పాపులారిటీ ఇస్తుంది.కానీ ఇదే సోషల్ మీడియాలో అంతకు మించిన నెగెటివిటీ,ఫేక్ న్యూస్ , ఫాల్స్ గాసిప్స్ ,బ్యాడ్ కామెంట్స్ వంటివెన్నో నిత్యం భరించాల్సి ఉంటుంది.ఇదిగో ఇలాంటి నెగెటివిటీనే ఎదుర్కుంటుంది కన్నడ భామ, ప్రముఖ నటి తనూజ పుట్టస్వామి.

జీ తెలుగు ‘ముద్ద మందారం’ సీరియల్‌లో పార్వతిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ, బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన సంగతి తెల్సిందే. బిగ్ బాస్ ముగిసిపోయి నెలలు గడుస్తున్నా, తన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న కామెంట్స్ గత కొన్ని రోజులుగా మరింత హద్దులు దాటడంతో ట్రోలర్స్ పై మండిపడిపోయింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.తన పర్సనల్ లైఫ్‌పై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్న వారికి సోషల్ మీడియా వేదికగా సాలిడ్ కౌంటర్ ఇస్తూ గట్టి వార్నింగే ఇచ్చింది.

Advertisement

కళ్యాణ్ పడాల, పవన్ సాయిలకు, తనూజకు అస్సలు పడట్లేదా 

అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, పవన్ సాయిలకు, తనూజకు అస్సలు పడట్లేదని, వీళ్ళ మధ్య గొడవలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయని,అన్నింటి కన్నా ముఖ్యంగా కళ్యాణ్ పడాల వచ్చాకే పవన్ సాయిని తనూజ కావాలనే దూరం పెట్టిందని, సోషల్ మీడియాలోని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు తనూజని టార్గెట్ చేస్తూ ఒక రేంజ్ లో ఊదరగొట్టేశాయి.

Advertisement

also read:కోట్లు ఉన్నా కీప్యాడ్ ఫోన్ మాత్రమే.. నోలన్ ఫోన్ వాడకపోవడానికి అసలు కారణం ఇదేనా?

అయితే ఈ ఫేక్ రూమర్స్ మరింత శృతి మించడంతో తెగ ఫైర్ అయింది తనూజ.ఈ క్రమంలో అసలు తమ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో మాత్రమేనని, అక్కడ ఉన్నప్పుడు పోటీలు, చిన్న చిన్నగొడవలు ఉండటం సహజమని స్పష్టం చేసింది. ఇక అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత తామంతా చాలా మంచి స్నేహితులుగా ఉన్నామని, ఒకరి కష్టసుఖాల్లో మరొకరం తోడుగా నిలబడుతున్నామని తెలిపింది.

తమ మధ్య ఉన్నది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే

అంతే కాకుండా కళ్యాణ్ పడాలకు ఒక సమస్య వచ్చినప్పుడు తాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదట పవన్ సాయికే ఫోన్ చేసి హెల్ప్ అడిగినట్లు, పవన్ కూడా వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాడని వెల్లడించింది.ఇక కళ్యాణ్ పడాల వాళ్ల ఫ్యామిలీ తమకు చాలా ఏళ్ల నుంచి తెలుసని, తమ మధ్య ఉన్నది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని తేల్చి చెప్పింది. అలాగే పవన్ సాయి, ఆయన భార్య హరిత ప్రస్తుతం తమ సొంత ప్రాజెక్టులతో, షూటింగ్ లతో బిజీగా ఉన్నారని, వారిని అనవసర వివాదాల్లోకి లాగవద్దని కోరారు.

అనవసరంగా జోక్యం చేసుకోవద్దు

వ్యూస్ పిచ్చితో ఇతరుల ప్రైవేట్ లైఫ్‌పై నీచమైన కథలు అల్లేయడం,రూమర్లు క్రియేట్ చేయడం సరైన పద్ధతి కాదని ట్రోలర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది.నెగిటివ్ కామెంట్లు చేసే వారికి వేరే పనేమీ లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి.. అంతేగానీ ఇతరుల పర్సనల్ లైఫ్‌లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు”అని ఒక రేంజ్ వార్నింగ్ ఇచ్చేసింది. అలాగే తన అభిమానులకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ, తనపై వచ్చే నెగిటివ్ పోస్టులు లేదా ట్రోలింగ్ వీడియోలను తనకు అసలు పంపొద్దని అలాంటివి చూడటం వల్ల తాను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

చూడాలి మరి తనూజ ఇచ్చిన ఈ కౌంటర్ కైనా రూమర్ రాయుళ్ళు తమ గాసిప్పులకి ఎండ్ కార్డ్ వేస్తారేమో !

Related News

నోరా ఫతేహికి బిగ్ షాక్.. రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేసిన ప్రముఖ సంస్థ!

బోయపాటి సెంటిమెంట్‌కు తమిళ బ్రదర్స్ నో?

త్రిషకు అండగా కంగనా.. ఉదయ్ నిధి స్టాలిన్ కు గట్టి కౌంటర్!

మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!

ఢిల్లీ భవన ప్రమాదంపై సోనూసూద్ డిమాండ్!

కైపెక్కించే ఫోజులతో విష్ణుప్రియ కిర్రాక్ లుక్.. ఫోటోస్ వైరల్!

చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు!

అప్పుడు అవమానం.. ఇప్పుడు అభిమానం.. తెలంగాణ యాసను తవ్వి తలకెత్తుకుంటున్న టాలీవుడ్!

Big Stories

Advertisement
×