E-Paper
Advertisement

Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!

Rythu Bima: తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. ఆగిపోనున్న రైతు బీమా పథకం!
Advertisement

Rythu Bima: స్వేచ్చ బ్యూరో: ఏదైనా ప్రమాదం జరిగినా, అకాల మరణం సంభవించినా గుండె పగిలిన రైతు కుటుంబానికి ఆర్థిక కొండంత అండగా నిలిచే ‘రైతు బీమా’ పథకానికి గ్రహణం పట్టుకుంది. పథకం పునరుద్ధరణ (రెన్యూవల్) గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఏటా ఆగస్టు మధ్య నాటికి పూర్తవ్వాల్సిన ఈ ప్రక్రియ ఈసారి అసలు మొదలే కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతి ఏటా అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించే బీమా రెన్యూవల్ ప్రక్రియ ఈసారి అసలు ఊసే లేకుండా పోయింది.

ఆగస్టు 14తో ముగియనున్న ప్రీమియం!

ప్రస్తుత రైతు బీమా పాలసీ గడువు ఆగస్టు 14 అర్ధరాత్రితో ముగియనుంది. నిబంధనల ప్రకారం.. ఆగస్టు 15 నుంచి కొత్త ఏడాదితో బీమా రక్షణ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకోసం ఈపాటికే వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి, అర్హులైన కొత్త రైతుల వివరాలను సేకరించి, పాత వారితో కలిపి ఎల్‌ఐసీ కి జాబితాలు పంపించాల్సింది. అయితే, ఇప్పటివరకు ప్రీమియం చెల్లింపులు, రెన్యూవల్ ప్రక్రియపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని సమాచారం.

ఖజానాలో నిధుల ‘కటకట’?

Advertisement

పథకాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వం తక్షణమే ఎల్‌ఐసీకి ప్రీమియం బకాయిలతో పాటు కొత్త ఏడాదికి సంబంధించిన నిధులను జమ చేయాల్సి ఉంది. సమారు రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు ఉన్నట్లు సమాచారం. వీరందరికి ప్రీమియం కోసం ప్రభుత్వానికి కనీసం రూ.1,500 కోట్లకు పైగా నిధులు తక్షణమే అవసరమవుతాయి. ఖజానాలో నెలకొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయలేకపోతోందని ప్రచారం జరుగుతుంది.

Also read: CJP ఆందోళనలు.. 17 మెట్రో స్టేషన్లు బంద్, స్తంభించిన ప్రయాణాలు!

అన్నదాతకు రక్షణ ఏది?.. మరణిస్తే దిక్కెవరు?

Advertisement

ఆగస్టు 14 లోగా ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం నిధులు చెల్లించకపోతే, ఆగస్టు 15 నుంచి పాలసీ రద్దవుతుంది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, ఆ కుటుంబానికి అందాల్సిన రూ. 5 లక్షల బీమా పరిపరిహారం నిలిచిపోతుంది. ‘అసలే అప్పుల బాధల్లో ఉన్న తమకు ఈ పరిపరిహారమే ఏకైక ధీమా అని, అది కూడా అందకపోతే తమ పరిస్థితి ఏమిటి?’ అని రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

గత ఏడాది 42.16 లక్షల మంది రైతులు ఎన్ రోల్

ఏ కారణంతో రైతు చనిపోయినా 10 రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం నేరుగా నామినీ ఖాతాలో జమ కావడం రైతు బీమా ప్రత్యేకత. దీంతో రాష్ట్రంలోని 42.16 లక్షల కుటుంబాలకు ఇది పెద్ద దిక్కుగా మారింది. గతంలో ఏటా జూలై నెలలోనే సర్వేలు, కొత్త రైతుల నమోదు ప్రక్రియ హడావుడిగా సాగేది. కానీ, ఈసారి జూలై చివరివారం వచ్చినా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో పథకం భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గడువు ముగిసేందుకు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని, ఆగస్టు 14 లోపు రెన్యూవల్ పూర్తి చేసి అన్నదాతలకు భరోసా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also read: BSNL మరో దుమ్మురేపే ప్లాన్.. 700GB డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ.. 6 నెలలు పండగే!

Related News

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత

దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

హరీష్‌ రావును నమ్మితే మన్నుతో అంబలి తాగినట్టే!- సీఎం రేవంత్

కుళ్లిన అల్లం, ఫంగస్‌ వెల్లుల్లితో ఏ1 పేస్ట్.. మేడ్చల్‌లో అధికారుల గుట్టు రట్టు!

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు బిగ్ షాక్.. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై BCI స్టే!

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై ఈటల రాజేందర్‌ సంచలన నిర్ణయం.. ఈ నెల 27 నుంచి పాదయాత్ర!

Big Stories

Advertisement
×