E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఇక గ్యాప్ ఇస్తే ఇంటికొచ్చి కొట్టండి.. ఫ్యాన్స్‌కు అఖిల్ షాకింగ్ ఓపెన్ ఆఫర్!

ఇక గ్యాప్ ఇస్తే ఇంటికొచ్చి కొట్టండి.. ఫ్యాన్స్‌కు అఖిల్ షాకింగ్ ఓపెన్ ఆఫర్!
Advertisement

Akhil Promise: అఖిల్ అక్కినేని.. నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ కుర్ర హీరో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడనే చెప్పాలి.ప్రతి సినిమాకి కష్టపడుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఈసారి లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు .అలా ఏజెంట్  తర్వాత దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉంటూ ఎన్నో కథలు విన్న అఖిల్ మొత్తానికి మురళీకృష్ణ అబ్బురు దర్శకత్వంలో లెనిన్ అనే సినిమాని ఓకే చేశాడు .

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈనెల 10న థియేటర్లోకి రావడానికి రెడీ అయిపోయింది.ఈ సందర్భంగా అఖిల్ తన కెరీర్ ప్లాన్స్  అండ్ సినిమా బడ్జెట్ వివాదాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.గతంలో అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ,వంటి  సినిమాలు ఎలాంటి ఫలితాలని ఇచ్చాయో తెలిసిందే .

ఫ్యాన్స్ డైరెక్ట్ గా  ఇంటికి వచ్చి కొట్టవచ్చన్న అఖిల్ 

Advertisement

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సో సో గా ఆడటం ఆ తర్వాత వచ్చిన ఏజెంట్ రెండేళ్లపాట షూటింగ్ జరుపుకొని ఎటూ కాకుండా పోవడంతో సినిమాలకి దూరమైపోయాడు అఖిల్.అలా లెనిన్ కోసం దాదాపు మూడేళ్లు టైం తీసుకోవడంతో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు అక్కినేని ఫ్యాన్స్ .ఇక ఇదే విషయంపై అఖిల్ రియాక్ట్ అవుతూ ఫ్యాన్స్ కి ఒక క్రేజీ ప్రామిస్ చేసుకొచ్చాడు.ఇకపై తన కెరీర్లో గ్యాప్ అనేది ఉండదని ఒకవేళ తాను గాని మళ్లీ ఇలా ఆలస్యం చేస్తే ఫ్యాన్స్ డైరెక్ట్ గా  ఇంటికి వచ్చి కొట్టవచ్చు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు .

సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయితే అవ్వదు 

అయితే ఆ ప్రెజర్ ఉంటేనే తాను కంటిన్యూగా సినిమాలు చేయగలనని ఈ క్రమంలోనే  తన నెక్స్ట్ రెండు సినిమాలన్నీ లైన్లో పెట్టానని హింట్ ఇచ్చాడు.ఇక ఆ రెండు సినిమాలు కూడా పీరియాడిక్ జోనర్ లోనే ఉంటాయని త్వరలోనే వాటిని అనౌన్స్ చేస్తానని స్పష్టం చేసుకొచ్చారు మన అయ్యగారు .మరోవైపు లెనిన్ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ సర్క్యులేట్  అయిన సంగతి తెలిసిందే.సినిమాలో చాలాసార్లు రీషూట్  చేశారని అఖిల్ మార్కెట్ కన్నా సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి .అయితే దీనిపై అఖిల్ మాట్లాడుతూ సినిమా కచ్చితంగా కాస్ట్ ఫెయిల్యూర్ అయితే అవ్వదని ప్రామిస్ చేశాడు .

Advertisement

Also read :రౌడీ హీరోతో కోల్డ్ వార్.. మూడేళ్ల తర్వాత నోరు విప్పిన అభిషేక్ నామా!

ఇక తన హోమ్ బ్యానర్ డబ్బు మాత్రమే కాదని ,సూర్యదేవర నాగవంశి కూడా ఇందులో పార్టనర్ గా ఉన్నాడని గుర్తు చేశాడు.ఇక సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ నిర్మించినప్పటికీ అంతా తమ మార్కెట్ పరిధిలోనే ప్లాన్ చేశామని బిజినెస్ లెక్కల విషయంలో తమంత చాలా ప్రాక్టికల్ గా ఉన్నామని రూమర్లకి ఎండ్ కార్డ్ వేశాడు  అఖిల్.

చూడాలి జులై 10న ఎలాంటి ఫలితం రానుందో !

ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో తన తండ్రి నాగార్జున సినిమాలు ప్రొడ్యూస్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదని తెలిపాడు.సొంత ప్రొడక్షన్లో వర్క్ చేయడం అంటే తలపై తుపాకీ పెట్టి పని చేయించుకున్నట్టే అంటూ సరదాగా కామెంట్ చేసుకొచ్చాడు.నాగార్జున ప్రతి పైసా లెక్క చూస్తారని కథని 100% నమ్మితేనే రంగంలోకి దిగుతారని చెప్పాడు.ఇక ఈ సినిమా ప్రొడక్షన్ లో బాగమవ్వడం వల్ల ఒక నటుడు గానే కాకుండా సినిమా వెనుక ఉండి అన్ని డిపార్ట్మెంట్లను ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలో ప్రాక్టికల్ గా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు అఖిల్ ఏది ఏమైనా అఖిల్ చూపిస్తున్న కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈసారి అఖిల్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేసేలానే కనిపిస్తున్నాడు.చూడాలి జులై 10న ఎలాంటి ఫలితం రానుందో !

Related News

రౌడీ హీరోతో కోల్డ్ వార్.. మూడేళ్ల తర్వాత నోరు విప్పిన అభిషేక్ నామా!

ఎస్పీబీని ఇళయరాజా అంతలా ఎందుకు హర్ట్ చేశారు? నిజాలు బయటపెట్టిన ఎస్పీ చరణ్!

40 ఏళ్ల బంధం, లెక్కలేనన్ని అఫైర్స్.. ఆభయంతోనే సైలెంట్‌గా ఉన్నానన్న గోవిందా భార్య!

Nagabandham Twitter Review : ‘ నాగబంధం ‘ ట్విట్టర్ రివ్యూ.. అడ్వెంచర్ ఎలా ఉందంటే..?

ఆ యాంగిల్లో ఫొటోలా? లైవ్‌లోనే కెమెరామెన్లకు క్లాస్ పీకిన స్టార్ హీరోయిన్!

యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

కన్నడలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. వైరల్ అవుతున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కౌంట్‌డౌన్ పోస్టర్!

Big Stories

×