E-Paper
Advertisement

రౌడీ హీరోతో కోల్డ్ వార్.. మూడేళ్ల తర్వాత నోరు విప్పిన అభిషేక్ నామా!

రౌడీ హీరోతో కోల్డ్ వార్.. మూడేళ్ల తర్వాత నోరు విప్పిన అభిషేక్ నామా!
Advertisement

Abhishek Nama: అభిషేక్ నామా , విజయ్ దేవరకొండ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో వీళ్ళ మధ్య నడిచిన కోల్డ్ వారి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.మూడేళ్ళ క్రితం వరల్డ్ ఫేమస్ లవర్( 2020) సినిమా డిజాస్టర్ అవడంతో  మొదలైన వివాదం ఆ తర్వాత 2023లో ఖుషి సినిమా రిలీజ్ టైం లో మరింత ముదిరిపోయింది .ఆ సమయంలో విజయ్ దేవరకొండని  టార్గెట్ చేస్తూ ప్రొడ్యూసర్ కమ్ డిస్టిబ్యూటర్   అభిషేక్ నామా చేసిన ట్వీట్స్ అండ్ కామెంట్స్  టాలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపాయి.

సినిమా ఫ్లాప్ అయిన విషయంలో వచ్చిన మనస్పర్ధలు వల్ల దేవరకొండ ఫ్యాన్స్ కూడా అభిషేక్ నామాపై సోషల్ మీడియాలో ఫైర్ అయిపోయారు .ఈ గొడవ కారణంగా వీరిద్దరి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది .అయితే కాలం గడిచిన కొద్దీ పాత విషయాలను పక్కనపెట్టి సరికొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు ఇద్దరు .

Advertisement

మళ్ళీ కలిసే అవకాశం ఉందంటూ హింట్

తాజాగా అభిషేక్ నామ ఈ పాత కాంట్రవర్సీపై స్పందించిన తీరు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద కుటుంబమని, ఇలాంటి చోట గొడవలు మనస్పర్ధలు రావడం చాలా కామన్ అని కొట్టిపారేశారు. ఈ క్రమంలో ఫ్యూచర్లో తామిద్దరం మళ్ళీ కలిసే అవకాశం ఉందంటూ హింట్ కూడా ఇచ్చారు.

Advertisement

అయితే ఇంతా చెప్పినప్పటికీ తామిద్దరం వ్యక్తిగతంగా కూర్చుని మాట్లాడుకున్నామని గాని, ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవలు లేవని విషయాన్ని గాని ఆయన ఎక్కడ చెప్పకపోవడం ఎక్కడ గమనార్హం.ఇదే సమయంలో విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు తాను మాత్రం సిద్ధంగా ఉన్నారని అభిషేక్ నామా చెప్పడం ఇక్కడ విశేషం.

నాగబంధం సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా

విజయ్ కి  గనుక తన కథ నచ్చితే తనే సొంతంగా దర్శకుడుగా మారి  ఒక భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తానని చెప్పాడు అభిషేక్ నామ.ఇక ఇప్పటికే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలని నిర్మించిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఇక అభిషేక్ నామ ప్రస్తుతం “నాగబంధం” (ది సీక్రెట్ ట్రెజర్)అనే భారీ విజువల్ వండర్ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు.

దాదాపు మూడు గంటల ఐదు నిమిషాల లెంత్ తో   వస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.ఈ రోజుల్లో చాలామంది మేకర్స్ గ్రాఫిక్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతుంటే తమ టీం మాత్రం ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని ప్రతి ఫ్రేమ్ ని ఫుల్  లెంత్  గ్రాఫిక్ వర్క్ తో ఒక విజువల్ ఫీస్ట్ లా  తీర్చిదిద్దినట్లు చెప్పుకొచ్చాడు అభిషేక్ నామా .

Also read :ఎస్పీబీని ఇళయరాజా అంతలా ఎందుకు హర్ట్ చేశారు? నిజాలు బయటపెట్టిన ఎస్పీ చరణ్!

మొత్తానికి పాత గొడవలని  పక్కనపెట్టి విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేయడం ద్వారా అభిషేక్ నామ ఇండస్ట్రీలో సరికొత్త డిబేట్ కి తెరలేపాడు .చూడాలి మరి మన రౌడీ ఈ స్టేట్మెంట్ పై ఎలా స్పందిస్తాడో !

Related News

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

Big Stories

Advertisement
×