E-Paper
Advertisement

ట్విషా శర్మ డెత్ మిస్టరీ….ఎయిమ్స్ రీ-పోస్ట్‌మార్టంతో టోటల్ సీన్ రివర్స్

ట్విషా శర్మ డెత్ మిస్టరీ….ఎయిమ్స్ రీ-పోస్ట్‌మార్టంతో టోటల్ సీన్ రివర్స్
Advertisement

Twisha Sharma:  ట్విషా శర్మ …ముప్పై మూడేళ్ల ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ డెత్ మిస్టరీ కేసు ఇపుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముంబై గ్లామర్ ఫీల్డ్‌తో పాటు బాలీవుడ్ సర్కిల్స్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది. ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి శవపరీక్ష నిర్వహించాలంటూ ఆమె తల్లి దండ్రులు పెట్టుకున్నఅర్జీని న్యాయస్థానం ఎట్టకేలకు ఆమోదించింది.

also read :గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడండి: న్యూయార్క్ వరదల్లో లైవ్ వీడియో

Advertisement

అయితే ఈసారి సాధారణ వైద్యులతో కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో ఈ రీ-పోస్ట్‌మార్టం ప్రక్రియను నిర్వహించబోతుండటం గమనార్హం. మొదటి పోస్ట్‌మార్టం నివేదికలో కొన్ని కీలక ఆధారాలను తొక్కిపెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమయిన సమర్థ్ సింగ్ 

Advertisement

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సమర్థ్ సింగ్ ఉదంతం మరింత హైడ్రామాకు తెరలేపింది. భార్య మరణించిన రోజు నుంచే అంటే గత పది రోజులుగా పోలీసుల కళ్లు గప్పి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిన సమర్థ్, ఎట్టకేలకు చట్టానికి దొరికిపోక తప్పదని గ్రహించి కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని అతని తరఫు లీగల్ టీమ్ అధికారికంగా ధృవీకరించడంతో ఈ కేసులో అసలు నిజాలు త్వరలోనే బయటకు రానున్నట్లు తెలుస్తోంది.

also read :ట్రోలర్స్‌కు గట్టి షాక్ ఇచ్చిన విష్ణుప్రియ.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

ఇటు కుటుంబ సభ్యుల పోరాటం, అటు నిందితుడి లొంగుబాటు వ్యూహాల మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక పోలీసుల దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో, ఈ మిస్టరీని ఛేదించే బాధ్యతను దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ (CBI) కి అప్పగిస్తూ సీఎంవో నుంచి కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

“మాయాజాల్” సమయంలోనే పరిచయం

అసలు విషయానికి వస్తే, 2021లో విడుదలైన సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ది లాస్ట్ విట్నెస్” లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ట్విషా శర్మ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 2023 మే నెలలో వచ్చిన రొమాంటిక్ డ్రామా “మాయాజాల్” సినిమా షూటింగ్ సమయంలోనే సమర్థ్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, అదే ఏడాది నవంబర్ 18న అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వీరి కాపురంలో గొడవలు మొదలైనట్లు సమాచారం. చివరిగా 2026 మే 12వ తేదీ రాత్రి జరిగిన పెద్ద గొడవ తర్వాత, మే 13వ తేదీ ఉదయం ట్విషా శర్మ తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటం బాలీవుడ్‌ను షేక్ చేసింది.

also read :‘ఆదర్శ కుటుంబం’ క్రేజీ లీక్….త్రివిక్రమ్ సెంటిమెంట్ రిపీట్!

ఆర్థిక లావాదేవీలు, ఫ్యామిలీ టార్చరే ఈ మరణానికి కారణమని గట్టిగా నమ్ముతున్న ట్విషా తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఎయిమ్స్ రిపోర్ట్ వస్తే కానీ ఇది ఆత్మహత్యా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యనా అన్నది బయటపడదు. చూడాలి ముందు ముందు ఈ మిస్టరీ డెత్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×