E-Paper
Advertisement

Oracle Layoffs: మీకిదే లాస్ట్ డే.. ఉ. 6 గంటలకు మెయిల్.. షాక్‌లో 30,000 మంది ఉద్యోగులు!

Oracle Layoffs: మీకిదే లాస్ట్ డే.. ఉ. 6 గంటలకు మెయిల్.. షాక్‌లో 30,000 మంది ఉద్యోగులు!
Advertisement

Oracle Layoffs: టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఐటీ రంగంలో పెను సంచలనంగా మారింది. ఈ మేరకు ఉద్యోగులకు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఉద్యోగ తొలగింపునకు సంబంధించిన మెయిల్స్ ను కంపెనీ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అది చూసి ఒక్కసారిగా ఖంగు తిన్న ఉద్యోగులు.. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

మెయిల్‌లో ఏముందంటే?

బిజినెస్ ఇన్ సైడర్ కథనం ప్రకారం.. ఒరాకిల్ నుంచి కంపెనీలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకు ఒక మెయిల్ వెళ్లింది. ‘ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిశీలించిన తర్వాత సంస్థాగత మార్పులు అవసరమని నిర్ణయించాం. సంస్థలో మీ రోల్ ను తొలగించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు తొలగింపు పత్రాలపై సంతకం చేసిన తర్వాత సెవరెన్స్ నిబంధనలు, షరతులకు లోబడి.. సెవరెన్స్ ప్యాకేజీని పొందేందుకు అర్హత సాధిస్తారు. ఇదే మీ లాస్ట్ డే. మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో ఒరాకిల్ పేర్కొంది. ఒరాకిల్ తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా దాదాపు 20,000-30,000 మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని టీడీ కోవెన్ అనే బ్యాంకింగ్ సంస్థ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.

లేఆఫ్స్‌కు వెనుక కారణాలేంటి?

Advertisement

టెక్ దిగ్గజం ఒరాకిల్ తన వ్యాపారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్ల వైపు మళ్లిస్తోంది. వీటి మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. నిధులను సమీకరించే క్రమంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ఒరాకిల్ ఈ తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు బిజినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో భాగంగా కొన్ని విభాగాలను విలీనం చేయడం లేదా అనవసరమని భావించిన రోల్స్‌ను తొలగించడం వంటివి చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: HYDRA Action: పాతబస్తీలో హైడ్రా ఉక్కుపాదం.. ఆక్రమణలు కూల్చివేత.. రూ.100 కోట్ల భూమి సేఫ్!

భారత్‌పై ప్రభావమెంత?

Advertisement

ఒరాకిల్ లేఆఫ్స్ నిర్ణయం.. భారత్ పై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఒరాకిల్ కఠిన నిర్ణయంతో ప్రభావితమయ్యే దాదాపు 30,000 మంది ఉద్యోగుల్లో భారత్ నుంచే సుమారు 12,000 మంది ఉన్నట్లు సమాచారం. భారత్ లో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు మంగళవారం (మార్చి 31) తెల్లవారుజామున 6 గంటలకు ‘మీ రోల్ ఇక అవసరం లేదు’ అని ఒక మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి సిస్టమ్ యాక్సెస్‌ను కూడా ఒరాకిల్ వర్గాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగం కోల్పోయినవారికి కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను సైతం ఒరాకిల్ ప్రకటించడం గమనార్హం.

Also Read: Induction Stove: ఇండక్షన్ స్టవ్‌పై నీరు చిందితే.. షాక్ కొడుతుందా? ఈ నిజాలు తెలుసుకోండి!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×