E-Paper
Advertisement

Lenin First Single: న్యూ ఇయర్ స్పెషల్.. పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన లెనిన్ టీమ్ ..

Lenin First Single: న్యూ ఇయర్ స్పెషల్.. పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన లెనిన్ టీమ్ ..
Advertisement

Lenin First Single: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నటుడు నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరియర్ పరంగా పరవాలేదు అనిపించుకున్న అఖిల్(Akhil) మాత్రం సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలం పూర్తి అయిన సరైన సక్సెస్ మాత్రం పడలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితోనే అఖిల్ లెనిన్ సినిమా(Lenin Movie) కోసం పని చేస్తున్నారని చెప్పాలి.

రాయలసీమ లవ్ బ్యాక్ డ్రాప్ ..

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాయలసీమ లవ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కాస్త షూటింగ్ పనులు ఆలస్యమైన నేపథ్యంలోనే విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే సినిమా నుంచి అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం తాజాగా అధికారికంగా వెల్లడించారు.

జనవరి 5న ఫస్ట్ సింగిల్..

Advertisement

న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే కొత్త సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి కూడా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వెల్లడించారు .ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5వ తేదీ విడుదల కాబోతుందని అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. మార్చి నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ (Bhagya Shri) నటించబోతున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు. కొంత భాగం శ్రీ లీలపై షూటింగ్ చేసిన అనంతరం ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకోవడంతో తిరిగి భాగ్యశ్రీని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని కేవలం శ్రీ లీలపై చిత్రీకరించిన సన్నివేశాలను మాత్రమే షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక భాగ్యశ్రీ ఇప్పటివరకు తెలుగులో నాలుగు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న విధంగా సక్సెస్ అందించలేకపోయింది. మరి లెనిన్ సినిమా ద్వారా అయినా భాగ్యశ్రీ సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:  Manchu Vishnu: న్యూ ఇయర్ బ్లాస్ట్.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన మంచు విష్ణు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×