E-Paper
Advertisement

Lenin Movie : అఖిల్ ‘లెనిన్ ‘ మళ్ళీ వాయిదా..? అయ్యగారి సినిమా వచ్చేది అప్పుడేనా..?

Lenin Movie : అఖిల్ ‘లెనిన్ ‘ మళ్ళీ వాయిదా..? అయ్యగారి సినిమా వచ్చేది అప్పుడేనా..?
Advertisement

Lenin Movie : అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించాడు. ఆయన నటించిన సినిమాలు ఏవి కూడా అతనికి స్టార్ డం ని అందించలేదు.. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని భారీ కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఆ మూవీని లెనిన్ .. టాలీవుడ్ మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ప్రస్తుతం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఏ మూవీ ఏప్రిల్ లో థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ డేట్ మారే అవకాశాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అంటే లెనిన్ మూవీ మరోసారి వాయిదా పడడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. లెనిన్ మూవీ షూటింగ్ ఇప్పుడు ఎంతవరకు పెండింగ్ ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

లెనిన్ 25 రోజుల షూటింగ్ పెండింగ్..

ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా అవన్నీ కూడా మాత్రమే సొంతం చేసుకున్నాయి. గతంలో వచ్చిన ఏజెంట్ మూవీ కూడా అతనికి నిరాశనే మిగిల్చింది.. ఇప్పుడు ఎన్నో ఆశలతో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చేసారు.. లెనిన్ మూవీ భారీ హిట్ కొడుతుందని అందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కేవలం 25 రోజుల షూటింగు పెండింగ్ ఉందని తెలుస్తుంది. అందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని, ఇది క్లైమాక్స్ ఫైట్ అనే టాక్ వినిపిస్తోంది. అలానే రెండు పాటలు ఇంకా మొదలుపెట్టలేదని తెలుస్తుంది. షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read : ప్రభాస్ ‘ ఫౌజీ ‘ షూటింగ్ అప్డేట్.. ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే..?

లెనిన్ మూవీ.. 

భారీ యాక్షన్ సీక్వెల్ గా రాబోతున్న ఈ లెనిన్ మూవీ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.. ఈసారి అఖిల్ కచ్చితంగా భారీ హిట్ కొడతాడు అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమాని మే 1న మే డే సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు.. మార్చి నెలాఖరున రిలీజ్ కావాల్సిన రామ్ చరణ్ పెద్ది.. ఏప్రిల్ 30వ తేదీకి షిఫ్ట్ అయింది. దీంతో అఖిల్ సినిమా విడుదలపై సందిగ్ధ నెలకొంది.. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్స్ రెండు పెట్టినట్లు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.. మరి అందులో ఏదో ఒక తేదీని లాక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూరల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా లెనిన్ చిత్రం తెరకెక్కుతోంది.. ఇప్పటివరకు అఖిల్ ఎన్నడు కనిపించని లుక్కులో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇకపోతే అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. శివాజీ, రాంకీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రిలీజ్ అయ్యాక అయ్యగారి అకౌంట్లో బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందో లేదో చూడాలి…

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×