E-Paper
Advertisement

Fauji Shooting Update : ప్రభాస్ ‘ ఫౌజీ ‘ షూటింగ్ అప్డేట్.. ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే..?

Fauji Shooting Update : ప్రభాస్ ‘ ఫౌజీ ‘ షూటింగ్ అప్డేట్.. ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే..?

Fauji Shooting Update : టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈ ఏడాది ఆయన నటించిన రాజా సాబ్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చింది. హారర్ కామెడీ మూవీ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ మూవీలో నటిస్తున్నాడు.. సీతారామన్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ ఈ ఏడాదిలోని థియేటర్లలోకి రాబోతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ అప్డేట్ గురించి ఆయన అభిమానులు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఫౌజీ షూటింగ్ అప్డేట్..

హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఫౌజీ.. యుద్ధ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తుంది. చిత్రం ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే ఒక యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.. ఈ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల పాటు సాగుతుందని, ఇది ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.. ఇది కేవలం యాక్షన్ ఎపిసోడ్ గా మాత్రమే కాదు.. ఈ సినిమా స్టోరీని మరో మలుపు తిప్పుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ప్రభాస్ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు హను రాఘవపూడి స్టైల్ ఎమోషన్స్ ఈ సీక్వెన్స్‌లో బాగా ఉంటాయని తెలుస్తోంది.. మరి ఈ మూవీతో ప్రభాస్ ఎలాంటి రికార్డు లను బ్రేక్ చేస్తాడో చూడాలి..

Also Read : అమ్మాయిలతో చక్రీ పులిహోర..తాయారు దెబ్బకు మహా షాక్.. కేశవ, శైలజ ఫైట్..

ఫౌజీ మూవీ విషయానికొస్తే.. 

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఏడాది వచ్చినా రాజా సాబ్ రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు అందరూ ఫౌజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో పాటు జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ నటులు కూడా ఇతరలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 70 శాతం షూటింగ్ పూర్తవడంతో, మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పై ఫోకస్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా త్వరగా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసుకుందామని ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఈ ఏడాదిలోనే రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ ప్రభాస్ నటించిన సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతుంది.. అలాగే కల్కి 2 షూటింగ్ కూడా అప్పుడే మొదలైపోయింది.. ఆ తర్వాత సలార్ 2 షూటింగ్ పూర్తిచేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తుంది..

Related News

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

Big Stories

×