E-Paper
Advertisement

Alpha: ఆలియా భ‌ట్ ‘ఆల్ఫా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Alpha: ఆలియా భ‌ట్ ‘ఆల్ఫా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Alpha: ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయమయ్యారు. తెలుగులోనూ ఫాలోయింగ్‌ని, ఫ్యాన్స్‌ని ఆమె సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) బ్యాన‌ర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆల్ఫా’‌ (Alpha)లో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్‌ను రివీల్ చేశారు. అదేంటంటే.. ఈ సినిమాను జూలై 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయబోతున్నట్లుగా నిర్మాత‌లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఆలియా భట్ పేరు, ‘ఆల్ఫా’ టైటిల్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

Also Read- Alekhya Tarakaratna: తారకరత్న మరణం.. ఇంటికి పిలిచి మరి అవమానించారు.. అలేఖ్య ఎమోషనల్!

యాక్షన్ బ్లాక్ పోస్టర్‌తో రిలీజ్ డేట్

వైఆర్ఎఫ్ బ్యాన‌ర్‌, ఆలియా, శర్వరి.. ఈ కొత్త అప్డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆలియా భట్ నయా యాక్షన్ లుక్ కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆమె ముఖం మీద గాయాలు, గాట్లు క‌నిపిస్తున్నాయి. ఈ పోస్టర్ గమనిస్తే.. చూస్తుంటే రక్తపాతంతో నిండిన యాక్ష‌న్ బ్లాక్ ఇదని తెలుస్తోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఆలియా భ‌ట్‌తో పాటు హిందీ సినీ పరిశ్రమలో అప్‌క‌మింగ్ స్టార్ శ‌ర్వ‌రి కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఇంకా ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అనీల్ కపూర్‌, బాబీ డియోల్ వంటి వారు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. సినిమాలో ఆలియా, శర్వరి కలిసి బాబీ డియోల్‌ను ఢీ కొట్టేలా కఠినమైన పోరాటంలో తలపడనున్నట్టుగా ఈ పోస్టర్ స్పష్టతనిస్తోంది.

Also Read- Star Herione: పెళ్లికి సిద్ధమైపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌తో ప్రేమ..!

ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని విధంగా..

‘ఆల్ఫా’ చిత్రంతో తొలిసారి ఆలియా భ‌ట్ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. అలాగే ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కుతోన్న ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో అలియా భట్, శ‌ర్వ‌రి కలిసి ప్రేక్షకులు ఇప్పటివరకు తెరపై ఏ హీరోయిన్ చేయ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో న‌టించినట్లుగా చిత్రయూనిట్ చెబుతూ వస్తోంది. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై గ్లోబ‌ల్ హిట్ సిరీస్ ‘ది రైల్వే మెన్’ను తెర‌కెక్కించిన శివ్ ర‌వైల్ (Shiv Rawail) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆదిత్య చోప్రా ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రమోషన్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. కచ్చితంగా, ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. చూద్దాం మరి.. జూలై 10న ఏం జరుగుతుందో?

Also Read- South Cinema: థియేటర్లలో సినిమా మనుగడ కోసం ఫిల్మ్ ఛాంబర్స్ కీలక నిర్ణయం! ఏంటంటే?

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×