Alekhya Tarakaratna: సినీ నటుడు నందమూరి తారకరత్న మరణించిన తర్వాత అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన భర్తకు సంబంధించిన విషయాలను తెలియచేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. తన భర్త మరణించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఆ సంఘటన నుంచి అలేఖ్య బయటపడలేదని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య తన భర్త గురించి అలాగే తారకరత్న మరణం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. తారకరత్న మరణించిన తర్వాత తనుకు జరిగిన అవమానాల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
తారకరత్న మరణించారనే విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఇప్పటికి తాను ఇంట్లోనే ఉన్నారనే భావనలోనే ఉంటున్నానని ఆయన మరణాన్ని స్వీకరించలేకపోతున్నానని తెలిపారు. అయితే తారక రత్న మరణించిన తర్వాత తాను అవమానాలను కూడా పడ్డానని తెలిపారు. పలు పూజా కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు తనను ఆహ్వానించారని వారి ఆహ్వానం మేరకు నేను వెళ్తే అక్కడికి వెళ్లిన తర్వాత కుంకుమ ముట్టుకోకూడదు, హారతి నువ్వు ఎదుకు ఇస్తున్నావు అంటూ చాలామంది మాట్లాడారు. ఆ సమయంలో నేను పడిన ఆవేదన చెప్పలేనని తెలిపారు. అలా అవమానించడానికి నన్ను ఎందుకు పిలవాలి? అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఐ మిస్ యు ఓబు..
ఇలా అవమానాలు పడ్డ తర్వాత తాను ఏదైనా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు చాలా దూరంగా ఉంటున్నానని, పెళ్లి కార్యక్రమం పూర్తయిన తరువాతనే వెళ్తున్నాను అంటూ అలేఖ్య తెలిపారు. మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇలాంటి తేడా చూపించలేదు కానీ బయట మాత్రం నాకు ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయని ఈమె ఎమోషనల్ అయ్యారు. తారక్ గారికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అనే ప్రశ్న ఎందుకు అవ్వడంతో ” ఐ మిస్ యు”, నువ్వు తిరిగి మా దగ్గరికి వచ్చేసేయ్ అని మాత్రమే చెబుతాను అంటూ అలేఖ్య రెడ్డి చేసిన ఈ కామెంట్స్ అందరినీ ఎంతగానో కలిచి వేసాయనే చెప్పాలి.
బాల బాబాయ్ కి అన్ని తెలుసు..
ఇక ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వారికి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారనే ప్రశ్న కూడా ఎదురవడంతో అలేఖ్య సమాధానం చెబుతూ జీవితం ఎవరికి శాశ్వతం కాదు నాకున్న అనుభవంతో చెబుతున్నాను. ఈరోజు కోసమే బ్రతుకు రేపటి కోసం ఆలోచిస్తూ బ్రతకద్దని, రేపు అనేది ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందుకే ఉన్న ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తూ బ్రతకాలని ఈమె తన అనుభవాన్ని తెలియజేస్తూ అందరికీ సూచనలు చేశారు. తారకరత్న భార్య ఎలా ఉంటుందనేది ఆయన మరణించే వరకు దాదాపు చాలా మందికి తెలియదు అలాంటి వ్యక్తి మొదటిసారి తన భర్త మరణం తర్వాత బయటకు వచ్చి ఎన్నో విషయాల గురించి ప్రస్తావించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక తారకరత్న మరణించిన తర్వాత తన ముగ్గురు పిల్లల బాధ్యతలను అలేఖ్య చేసుకుంటున్నారు తనకు అండగా విజయసాయిరెడ్డి కుటుంబం ఉందని ఎప్పుడు చిన్నాన్న ఫోన్ చేసి మాట్లాడిస్తుంటారని అలాగే వైఎస్ షర్మిల కూడా తన బాగోగులు చూసుకుంటున్నారని తెలిపారు. ఇక బాలయ్య గారికి నేనేం చెప్పకపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది నా సమస్య ఏంటి అనేది బాల బాబాయ్ గారికి వెళ్తుందని అంటూ అలేఖ్య తెలిపారు.
Also Read: Alekhya Tarakaratna: జీవితాన్ని తలకిందులు చేసిన రోజు.. యువగళం పాదయాత్రలో జరిగింది ఇదే: అలేఖ్యరెడ్డి