E-Paper
Advertisement

Alia Bhatt Assets: లగ్జరీ అపార్ట్మెంట్స్ నుంచి ఖరీదైన కార్ల వరకు.. ఆశ్చర్యపరుస్తున్న ఆలియా భట్ ఆస్తులు!

Alia Bhatt Assets: లగ్జరీ అపార్ట్మెంట్స్ నుంచి ఖరీదైన కార్ల వరకు.. ఆశ్చర్యపరుస్తున్న ఆలియా భట్ ఆస్తులు!
Advertisement

Alia Bhatt Assets:  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ , ప్రముఖ నటి సోనీ రజ్దాన్ దంపతుల కూతురే ఆలియా భట్ (Alia Bhatt). తల్లిదండ్రుల వారసత్వంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆలియా భట్.. 1999లో వచ్చిన సంఘర్ష్ అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఇక తర్వాత స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.. 2012లో వచ్చిన ఈ సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించింది.. ఆ తర్వాత హైవే , టూ స్టేట్స్ ఇన్ అంటూ దాదాపు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. 2022లో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సీత అనే కీలక పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నేడు అలియా భట్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. లగ్జరీ భవనాలను మొదలుకొని ఖరీదైన కార్ల వరకు ఆమె ఆస్తుల చిట్టా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆలియా భట్ ప్రాపర్టీస్..

ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలువబడే జుహు ఏరియాలో సుమారుగా 13.1 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ ను అలియా భట్ సొంతం చేసుకుంది. అలాగే ముంబైలోని మరో లగ్జరీ స్ట్రీట్ బాంద్రాలో ఒక అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది . దీని విలువ 32 కోట్లు. అలాగే 10 కోట్ల విలువైన మరో ఇంటిని బాంద్రాలో కొనుగోలు చేసింది ఆలియా భట్. అలాగే రెండు కోట్ల విలువైన ప్రొడక్షన్ ఆఫీస్ ను కూడా ముంబైలోనే ఓపెన్ చేసింది.

ఖరీదైన కార్లు..

Advertisement

ఆలియా భట్ కి కార్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె కార్ గ్యారేజ్లో కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ బ్రాండ్లు ఉన్నాయి. అందులో6 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జిటి, 2.5 కోట్ల విలువైన లెక్సస్ LM 350h, 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్ రోగ్, 1.4 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్, 1.8 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, 70 లక్షల విలువైన ఆడి ఏ 6, 1.5 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్, 90 లక్షల విలువైన ఆడి క్యూ 7, 90 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఇవోక్ వంటి లగ్జరీ కార్లను ఆమె సొంతం చేసుకుంది.

అలియా భట్ స్టార్టప్ కంపెనీస్..

ఇకపోతే ఈమె స్టార్టప్ కంపెనీలను కూడా మొదలుపెట్టింది అందులో ఒకటి “Phool.co”.. ఇందులో టెంపుల్స్ ద్వారా స్వీకరించిన పువ్వులను ను రీసైక్లింగ్ చేస్తారు. “స్టైల్ క్రాకర్” అనే దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించింది.. అంతేకాదు చిన్నపిల్లల కోసం “సూపర్ బాటమ్స్” అనే మరో బ్రాండ్ ను స్థాపించిన ఈమె.. బ్యూటీ ఈ కామర్స్ సంస్థ అయిన “నైకా” లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది.

ఎండార్స్మెంట్స్..

Advertisement

ఆలియా భట్ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది . అందులో బ్యూటీ ప్రొడక్ట్స్ అయిన మేబిలిన్ న్యూయార్క్, మన్యావర్, ఫ్లిప్ కార్ట్, క్యాడ్బరీ డైరీ మిల్క్, లేస్, సాంసంగ్, కోకో కోల, గూచీ వంటి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

ఫిలిం రెమ్యూనరేషన్..

అలియా భట్ ఒక్కో చిత్రానికి 20 నుండి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది ముఖ్యంగా గంగూభాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలకు ఆమె ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచింది.

సోషల్ మీడియా ఫాలోవర్స్..

అటు సినిమాల పరంగా ఇటు బిజినెస్ పరంగా బిజీగా మారిన ఈమె అటు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఫేస్బుక్లో 30 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె ..ఎక్స్ లో 21.7 మిలియన్ ఫాలోవర్స్, ఇంస్టాగ్రామ్ లో 87 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.

 

also read: World Top most indian celebrities: రష్మిక రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ జాబితా!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×