E-Paper
Advertisement

Alia Bhatt: వదిలేయాలి అనుకున్నాను.. పర్సనల్ లైఫ్ గురించి ఆలియా భట్ సెన్సేషనల్ వ్యాఖ్యలు..

Alia Bhatt: వదిలేయాలి అనుకున్నాను.. పర్సనల్ లైఫ్ గురించి ఆలియా భట్ సెన్సేషనల్ వ్యాఖ్యలు..
Advertisement

Alia Bhatt: తల్లి అయిన తర్వాత జీవితం ఎంతగా మారిపోతుందో అనే విషయం గురించి నటి ఆలియా భట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా సూటిగా, నిజాయితీగా మాట్లాడారు. సోషల్ మీడియాతో తనకు ఉన్న సంబంధం, అలాగే మాతృత్వం తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చిందో ఆమె వివరించారు.

ఆలియా మాట్లాడుతూ, “జీవితం చాలా వ్యక్తిగతమైనది. కొన్ని రోజులు అయితే సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ డిలీట్ చేసి, కేవలం నటిగా మాత్రమే ఉండాలనిపిస్తుంది. సోషల్ మీడియాని పూర్తిగా వదిలేయాలి అనిపించింద,” అని అన్నారు. రోజూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ప్రతి విషయంపై స్పందించాల్సి రావడం కొన్నిసార్లు చాలా భారంగా అనిపిస్తుందని చెప్పారు. అయినప్పటికీ, మొదటి నుంచి తనను ఆదరిస్తూ వచ్చిన అభిమానులతో సంబంధం తెంచుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతున్నానని తెలిపారు.

Advertisement

మాతృత్వం గురించి మాట్లాడుతూ, అది చిన్న మార్పు కాదని, జీవితాన్నే మార్చేసే అనుభవమని ఆలియా చెప్పారు. తొమ్మిది నెలల గర్భధారణ సమయంలో శరీరం, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ నెమ్మదిగా మారుతాయని అన్నారు. తన కుమార్తె రాహాను చూసిన క్షణం నుంచి ఆ మార్పు ఎంత గొప్పదో అర్థమైందని చెప్పారు. “ఆ మార్పు తర్వాత మళ్లీ పాత నేను లా మారడం సాధ్యం కాదు” అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.

తల్లి అయిన తర్వాత తన వ్యక్తిగత జీవితంపై తన దృష్టికోణం పూర్తిగా మారిపోయిందని ఆలియా చెప్పారు. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం మరింత వ్యక్తిగతంగా మారిందని, అందుకే అన్నీ బయట పెట్టడం కష్టంగా అనిపిస్తుందని అన్నారు. నవ్వుతూ, “నా ఫోన్ ఫోటో ఆల్బమ్ మొత్తం రాహా ఫోటోలతోనే నిండిపోయింది. నా ఫోటోలు తీయాలంటే ప్రత్యేకంగా కష్టపడాల్సి వస్తోంది” అని చెప్పారు.

Advertisement

సినిమాల విషయానికి వస్తే.. ఆలియా భట్ ప్రస్తుతం కూడా బిజీగానే ఉన్నారు. తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి ఓ యువత కథ ఆధారంగా రొమాంటిక్ కామెడీ సినిమాను నిర్మిస్తున్నారు. నటిగా ఆమె త్వరలో లవ్ అండ్ వార్ సినిమాలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. ఈ సినిమాలో ఆమె భర్త రణబీర్ కపూర్, అలాగే విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నారు. అదేవిధంగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో మరో సినిమా కూడా ఆమె చేతిలో ఉంది.

ALSO READ: Nagarjuna 100: దసరా రేసులోకి మన్మథుడి వందో సినిమా.. కింగ్ కోసం రెడీ అవుతున్న హీరోయిన్లు..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×