E-Paper
Advertisement

Paidakula Ashok: మేడారం జాతర దేశంలో మూలల ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక : కాంగ్రెస్ నేత పైడాకుల అశోక్!

Paidakula Ashok: మేడారం జాతర దేశంలో మూలల ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక : కాంగ్రెస్ నేత పైడాకుల అశోక్!
Advertisement

Paidakula Ashok:  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన మేడారం జాతర దేశంలోని నాలుగు మూలల ఆదివాసీల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ (Paidakula Ashok) పేర్కొన్నారు. మేడారం జాతరను విజయవంతం చేసిన మంత్రి సీతక్కకు (Minister Seethakka) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశం నలుమూలల మేడారం జాతర గురించి, సమ్మక్క సారలమ్మ పోరాట గాథను తెలియజేసేలా మేడారం గుడిని నిర్మించడంలో సీతక్క విజయవంతం అయ్యారని తెలిపారు.

Also Read: Gas cylinder: పేలుడు భయం లేదు.. తుప్పు పట్టే ఛాన్స్ లేదు: మీ వంటశాల కోసం సురక్షితమైన ‘నెక్స్ట్ జెన్’ సిలిండర్లు

మేడారం జాతరను విజయవంతం చేయడం సీతక్కకే సాధ్యం

Advertisement

ఒంటిచేత్తో ఆసియా ఖండంలోని అతి పెద్ద గిరిజన జాతరను సీతక్క విజయవంతం చేశారని పేర్కొన్నారు. ప్రతి పక్ష నాయకులు కుట్రలు చేసిన, విమర్శలు చేసిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో మేడారం జాతరను విజయవంతం చేయడం సీతక్క కే సాధ్యం అయ్యిందన్నారు. తెలంగాణ ఉక్కు మహిళా సీతక్క మేడారం అభివృద్ధి కోసం గట్టిగా నిలబడి మేడారం జాతర ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పారు.

మేడారం జాతరను ఘన విజయం

అతి తక్కువ సమయంలో మేడారం గుడి నిర్మాణ పనులను చేపట్టి, అనుకున్న సమయానికి అందజేసేలా చర్యలు తీసుకుని మేడారం జాతరను ఘన విజయం చేయడంలో సీతక్క గారి పాత్ర అత్యంత కీలకమన్నారు. జనవరి 28 నుండి 31 వరకు సాగిన మేడారం జాతరను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి సీతక్క గారికి, క్షణం తీరిక లేకుండా దగ్గరుండి పని చేపించిన ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర కి, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కు, అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవుళ్ళ మీద కూడా రాజకీయం చేయాలని చూసిన ప్రతిపక్ష నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ మేడారం జాతరను నడిపిన సీతక్క తీరు అమోఘమన్నారు.

Advertisement

Also Read: DCC Prisidents: తెలంగాణ కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షుల నియామకం.. 36 మందితో కూడిన జాబితా విడుదల

Related News

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

Big Stories

Advertisement
×