E-Paper
Advertisement

ఎన్టీఆర్ సినిమాలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ… పక్కాగా ప్లాన్ చేస్తున్న  ప్రశాంత్ నీల్!

ఎన్టీఆర్ సినిమాలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ… పక్కాగా ప్లాన్ చేస్తున్న  ప్రశాంత్ నీల్!
Advertisement

Jr.NTR -Neel: జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. హై యాక్షన్ వోల్టేజ్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి విషయాలను అధికారకంగా చిత్ర బృందం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోసారి ఎన్టీఆర్ సినిమాలో అలియా భట్..

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ (NTR)డ్రాగన్ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈమెతో పాటు మరొక నటి సైతం ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ (Alia Bhatt)కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈమె సీత పాత్రలో రామ్ చరణ్ జోడిగా నటించారు.

కథను మలుపు తిప్పే పాత్రలో అలియా..

Advertisement

టాలీవుడ్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఆలియా భట్ మరోసారి ఎన్టీఆర్ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆలియా పాత్ర కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం కాకుండా, కథను కీలక మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ ఇప్పటికే అలియాను కలిసి ఆమెతో చర్చలు జరపగా ఆమె కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. అతి త్వరలోనే ఆలియా పాత్రకు సంబంధించి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం.

డ్రాగన్ సినిమాలో షాహిద్ కపూర్..

Advertisement

ఇప్పటికే గ్లామర్ క్వీన్ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో భాగమయ్యారు ఇప్పుడు అలియా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరి కొంతమంది సీనియర్ నటీనటులు కూడా భాగం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనిల్ కపూర్ కుష్బూ వంటి వారి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఈ సినిమాలో టోవినో థామస్ కూడ కీలక పాత్రలో కనిపించబోతున్నారంటూ చిత్ర బృందం అధికారకంగా వెల్లడించినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈయన సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ను తీసుకోబోతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Also Read: డెకాయిట్ పై పెద్ది ప్రశంశలు…బాగా ఎంజాయ్ చేసానంటూ పోస్ట్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×