Meenakshi Chaudhary (Image credit: Instagram)
మీనాక్షి చౌదరి.. 1996 మార్చి ఐదున హర్యానాలోని పంచ్ కులాల్లో జన్మించిన ఈమె.. పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత 2018 లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి అందరిని ఆకట్టుకుంది.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
2021లో అక్కినేని హీరో సుశాంత్ తో కలిసి ఇక్కడ వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న మీనాక్షి.. ఆ తర్వాత ఖిలాడి, హిట్, గుంటూరు కారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో వరుసగా విజయాలను అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె.. ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న పౌరాణిక థ్రిల్లర్ మూవీ వృషకర్మలో నటిస్తోంది . ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
ఇకపోతే తెలుగు, తమిళ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భాగ్ 2 లో నటించిన ఈ ముద్దుగుమ్మ. విశ్వంభర , ఫోర్స్ 3, ఏజీఎస్ 27 వంటి చిత్రాలలో నటిస్తోంది.

Meenakshi Chaudhary (Image credit: Instagram)
ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా పింక్ కలర్ చుడీదార్ ధరించి బల్లపై కూర్చొని ముద్దులొలికేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. మీనాక్షి పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.