Jaya Krishna Debut film: ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్ భూపతి(Ajay Bhupathi) మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మంగళవారం, మహాసముద్రం అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే త్వరలోనే మరో సినిమా పనులలో అజయ్ భూపతి బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈయన ఘట్టమనేని మూడోతరం వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో దివంగత సీనియర్ నటుడు కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు వారసుడిగా జయ కృష్ణ(Jaya Krishna)ని హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ(Rasha thadani) హీరోయిన్ గా నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చూస్తే తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా రాబోతుందని అందరికీ అర్థమైంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్తా ప్రస్తుతం వైరల్ అవుతుంది. అజయ్ భూపతి ఈ సినిమా ద్వారా మరొక అద్భుతమైన ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం.
ఈ సినిమాకు “అలివేలు మంగాపురం ” (Alivelumangapuram) అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ వెలువడుతున్న నేపథ్యంలో ఘట్టమనేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మహేష్ బాబు వారసుడిగా జయకృష్ణ ఇండస్ట్రీలోకి రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ (G.V Prakash)సంగీతం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విలన్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో?
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో జెమిని కిరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరి విలన్ పాత్రలో కనిపించబోతున్న ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ఏంటీ? అనే విషయాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఘట్టమనేని వారసుడిగా జయ కృష్ణ ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీ లోకి రావడం కోసం ఇప్పటికే నటన పరంగా, డాన్స్ లోనూ పూర్తిస్థాయిలో శిక్షణ కూడా తీసుకున్నారని తెలుస్తోంది.
Also Read: Miss Universe 2025winner : 2025 మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నది ఈమెనే