E-Paper
Advertisement

Miss Universe 2025winner : 2025 మిస్ యూనివర్స్ కిరీటం అందుకున్నది ఈమెనే

Miss Universe 2025winner : 2025 మిస్ యూనివర్స్  కిరీటం అందుకున్నది ఈమెనే
Advertisement

Miss Universe 2025winner: 74వ మిస్ యూనివర్స్ అందాల పోటీలలో భాగంగా మెక్సికోకి చెందిన ఫాతిమా భాష్ (Fatima bosch) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ అందాల పోటీలలో భాగంగా సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ వంద మంది పోటీదారులను వెనక్కి నటి 74వ మిస్ యూనివర్స్(74th Miss Universe) కిరీటాన్ని ఫాతిమా అందుకున్నారు. ఫాతిమా ఈ పోటీలలో విజేతగా నిలవగా థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్(Praveenar Singh) మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఈ పోటీలలో విజయం సాధించిన ఫాతిమా కిరీటం ధరింప చేసే సమయంలో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పోటీలలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన మనికా విశ్వకర్మ టాప్ 30 వరకు చేరినా, టాప్ 12 వద్ద ఆగిపోయారు. ఇక ఈ పోటీలలో ఫాతిమా విజయం సాధించిన నేపథ్యంలో ఈమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

విక్టోరియా క్జార్ థెయిల్విగ్..

థాయిలాండ్ లో జరిగిన ఈ పోటీలలో భాగంగా ఫాతిమా కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో ఈ కిరీటాన్ని 73వ మిస్ యూనివర్స్, డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జార్ థెయిల్విగ్  విజేతకు కిరీటాన్ని అందజేశారు. ఐదు సంవత్సరాల తరువాత ఫాతిమా తిరిగి మెక్సికో నుంచి ఈ పోటీలలో పాల్గొని కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 2020వ సంవత్సరంలో మెక్సికో కి చెందిన ఆండ్రియా మెజా ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఫాతిమా విషయానికి వస్తే..

జంతు ప్రేమికురాలు..

Advertisement

మెక్సికోలోని టబాస్కోలోని విల్లాహెర్మోసాకు చెందిన ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ జంతువుల పట్ల ఎంతో దయా హృదయం కలవారు. ఇలా జంతు ప్రేమికురాలు అయిన ఈమె ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 25 సంవత్సరాల వయసులోనే ఫాతిమా డిస్లెక్సియా, ADHD, హైపర్ ఆక్టివిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే తన బలహీనతలనే బలంగా మార్చుకొని నేడు మిస్ యూనివర్స్ పోటీలలో విజేతగా కిరీటాన్ని అందుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

మాణికా విశ్వకర్మ..

Advertisement

ఫాతిమా మెక్సికోలోని యూనివర్సిడాడ్ ఇబెరో అమెరికానాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇలా ఫ్యాషన్ పట్ల ఎంతో మక్కువ ఉన్న ఫాతిమా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి నేడు మిస్ యూనివర్స్ గా నిలిచారు. ఇక ఈ పోటీలలో భారతదేశం నుంచి ప్రాతినిధ వహించిన మాణికా విశ్వకర్మ, స్విమ్‌సూట్ ప్రజెంటేషన్ తర్వాత టాప్ 12 రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా వచ్చే ఏడాది జరగబోయే 75వ, రజతోత్సవ ఎడిషన్ పోటీలకు ప్యూర్టో రికో ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించారు ఇక ఈ దేశం మిస్ యూనివర్స్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వటం ఇది మూడవసారి కావటం విశేషం.

Also Read: Peddi -The Paradise: అభిమానులకు బిగ్ షాక్.. వాయిదా పడనున్న ప్యారడైజ్..పెద్ది..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×