E-Paper
Advertisement

Miss Universe 2025: ఈ ఏడాది విశ్వసుందరి మెక్సికో బ్యూటీ, ఫాతిమా బాష్‌దే కిరీటం

Miss Universe 2025: ఈ ఏడాది విశ్వసుందరి మెక్సికో బ్యూటీ,  ఫాతిమా బాష్‌దే కిరీటం
Advertisement

Miss Universe 2025: ఈ ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని మెక్సికో బ్యూటీ ఫాతిమా బాష్ ఎగురేసుకుపోయింది.  టైటిల్ కోసం ఐదుగురు భామలు పోటీపడ్డారు. చివరకు మెక్సికో బ్యూటీ ఫాతిమాను వరించింది. ఇక భారత్ తరపున మణికా విశ్వకర్మ టాప్-12కు అర్హత సాధించలేకపోయింది. ఈ పోటీలు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగాయి.

ఈ ఏడాది విశ్వసుందరి మెక్సికో బ్యూటీ ఫాతిమా

Advertisement

ప్రపంచ సుందరీమణులు పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. థాయ్‌లాండ్ రాజధాని రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్ పోటీల్లో 74వ మిస్ యూనివర్స్-2025 కిరీటాన్ని మెక్సికో ఎగురేసుకుపోయింది. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. మెక్సికో బ్యూటీ ఫాతిమా బాష్‌ని కిరీటం వరించింది.

థాయ్‌లాండ్‌లోని నాంథబురిలో ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌లో ఈ పోటీలు జరిగాయి.  విశ్వ సుందరి-2025 టాప్ 5 విజేతలు ఇలా ఉన్నారు. విజేత ఫాతిమా బాష్‌తోపాటు మిగిలిన నాలుగు స్థానాల సుందరీమణులు వివరాలు చూద్దాం. మెక్సికోకు చెందిన 25 ఏళ్ల మోడల్ ఫాతిమా బాష్ విన్నర్‌‌గా నిలిచింది.

Advertisement

ALSO READ: ట్రంప్ కు మోదీ ఫోన్ కాల్,  ఆపై సంచలన వ్యాఖ్యలు

తొలి రన్నరప్ థాయ్‌లాండ్ కి చెందిన ప్రవీణార్ సింగ్ దక్కించుకుంది. సెకండ్ రన్నరప్‌గా వెనిజులా బ్యూటీ స్టెఫానీ అబసాలి నిలిచింది. థర్డ్ రన్నరప్‌గా ఫిలిప్పీన్స్ కి చెందిన అహ్తిసా మనాలో, నాలుగో రన్నరప్‌గా కోట్ డి ఐవోర్ కి చెందిన ఒలివియా యేస్ తర్వాత స్థానాల్లో నిలిచారు. భారతదేశానికి చెందిన మానికా విశ్వకర్మ టాప్-12 రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యింది.

ఈ పోటీలకు 100 దేశాలకు చెందిన బ్యూటీలు హాజరయ్యారు. విజేత ఫాతిమా బాష్‌పై హోస్ట్ నవాట్ ఇట్సారగ్రిసిల్ ఓ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరకు ముగ్గురు న్యాయమూర్తులు రాజీనామా చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివరకు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, మాజీ విశ్వ సుందరి నటాలీ గ్లెబోవా వంటి ప్రముఖులు న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఉన్నారు.  25 ఏళ్ల గతేడాది విజేత, డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా క్జార్ థెయిల్విగ్ నుండి కిరీటాన్ని అందుకుంది మెక్సికో బ్యూటీ ఫాతిమా బాష్.

సెకండ్ రన్నరప్ ప్రవీణార్ సింగ్ ఎవరు?

1996 ఏప్రిల్ 16న చియాంగ్ మైలో జన్మించిన ప్రవీణార్ సింగ్, భారతీయ కుటుంబం నుండి వచ్చింది. ఆ తర్వాత థాయ్ పౌరురాలు అయ్యింది. పోటీల్లోకి అడుగుపెట్టే ముందు థమ్మసాట్ విశ్వవిద్యాలయం నుండి రష్యన్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. 2018లో మిస్ యూనివర్స్ థాయిలాండ్‌లో చియాంగ్ మైకి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె రెండో రన్నరప్‌గా నిలిచింది.

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×