12A Railway Colony Censor and Run Time: ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో అల్లరి నరేష్. తనకు ఎంతో కలిసోచ్చిన కామెడీ జానర్ ని పక్కన పెట్టి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేస్తున్నాడు. అయినా ఈ అల్లరోడిని సక్సెస్ వరిస్తుంది. నాందితో తొలిసారి యాక్షన్ చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇల్లు మారెడిమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. గతేడాది వచ్చిన బచ్చల మల్లి మాత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది.
కానీ, ఆ వెంటనే 12ఏ రైల్వే కాలనీ (12A Railway Colony) మూవీ ప్రకటించాడు. నవంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. అయితే క్రైం థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందని, పైగా అభ్యంతకరమైన డైలాగ్స్ ఎక్కువ ఉండటంతో బోర్డు భారీగా కోతలు విధించింది. రక్తం ఎక్కువ ఉన్న సీన్స్ తొలగించి.. భూతులు వాడిన సన్నివేశాలను మ్యూట్ చేయడం లేదా వాటిని మరో డైలాగ్ తో రీప్లేస్ చేయాలని బోర్డు ఆదేశించిందట. అంతేకాదు ఏఏ సన్నివేశాలపై కూడా అభ్యంతరాలు ఉన్నాయో వెల్లడిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ విడుదల చేసింది.
అలా పలు కండిషన్స్ తో సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మూవీ ముందుమాటలో సవరణ చేయమని సూచించింది. ఈ సినిమా పూర్తిగా కల్పిత కథని, కేవలం వినోదం కోసమే రూపొందించినట్టు డిస్క్లైమర్ లో పెట్టాలని తెలిపింది. అలాగే క్లీవేజ్ షో షాట్ ని మార్చడం లేదా బ్లర్ చేయాలని సూచించింది. అదే విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్ సన్నివేశాలు, గోర్ కిల్లింగ్ సన్నివేశాలను తొలగించి వాటిప్లేస్ ప్రత్యామ్నాయ సన్నివేశాలు పెట్టాలని ఆదేశించింది. ఇలా మొత్తంగా 9 సీన్స్ పై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సవరణలు చేయాలని మూవీ టీం సూచించింది. అలాగే మూవీ రన్ టైం కూడా చాలా తగ్గించిందట.
Also Read: Premante Censor: ప్రేమంట మూవీకి షాకిచ్చిన సెన్సార్.. ఏకంగా 23 కట్స్
టోటల్ గా మూవీ రన్ టైం కేవలం 125 నిమిషాల 30 సెకండ్ల నిడివిని ఫిక్స్ చేసింది. అదే నిడివితో మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని బోర్డు టీంని ఆదేశించింది. కాగా మిస్టరీ మర్డర్స్ చూట్టూ తిరిగే ఈ క్రైం థ్రిల్లర్ లో అల్లరి నరేషన్ సీరియస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇందులో నరేష్ సరసన పొలిమేర ఫేమ్ డాక్టర్ కామాక్షీ భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనే నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అలాగే ‘పొలిమేర’ సిరీస్ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్. భీమ్స్ సిసిరోలియో ీ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సీనియర్ నటుడు సాయి కుమార్, విష్ణు హర్ష, గెటప్ శ్రీను, సిద్దాం, జీవన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.