E-Paper
Advertisement

OTT Movie : బర్త్ డే గర్ల్ నయనతార కెరీర్లో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : బర్త్ డే గర్ల్ నయనతార కెరీర్లో టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?
Advertisement

OTT Movie : ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమె గురించి, ఆమె సినిమాల గురించి తెలుసుకుందాం. ఈమె సౌత్ ఇండియా చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె 1984 నవంబర్ 18న బెంగళూరులో జన్మించింది. ఇప్పుడు ఆమెకు 41 ఏళ్లు నిండాయి. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగుళూరులో ఒక మలయాళీ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె తన కాలేజ్ రోజుల్లోనే 2003లో మలయాళ చిత్రం “మనస్సినక్కరే”తో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

అయితే 2005లో రజనీకాంత్‌ తో కలిసి నటించిన “చంద్రముఖి” చిత్రం ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. మలయాళంతో పాటు, తమిళం, తెలుగు, కన్నడ సినిమాలలో కూడా నటించి ఆమె మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత హిందూ మతంలోకి మారి, 2022 జూన్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. వారికి సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె పుట్టిన రోజు వేడుకను అభిమానులు కూడా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సమయంలో ఆమె నటించిన సినిమాలలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల గురించి తెలుసుకుందాం.

‘జవాన్’ (Jawan)

Advertisement

2023లో వచ్చిన ఈ బాలీవుడ్ సినిమాను, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించగా, అట్లీ దర్శకత్వం వహించాడు. ఇందులో షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్‌ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. నయనతార నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ రికార్డ్ సృష్టించింది. 300 కోట్ల బడ్జెట్‌తో 1152 కోట్లు వసూలు చేసింది.

‘బిగిల్’ (Bigil)

నయనతార నటించిన రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం బిగిల్. 2019 లో విడుదలైన ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద 304 కోట్ల వసూళ్లను సాధించింది. ఇందులో హీరోగా దళపతి విజయ్ ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమా కూడా అట్లీ దర్శకత్వంలో వచ్చింది.

‘సైరా నరసింహ రెడ్డి’ (Sye Raa Narasimha Reddy)

Advertisement

2019 లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి, నయనతార కలసి నటించారు. ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద 248 కోట్లు వసూలు చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.

‘దర్బార్’ (Darbar)

నయనతార, రజనీకాంత్ నటించిన ఈ సినిమా 2020లో విడుదలైంది. 175 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 238 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమాకి ఏ ఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహించారు.

‘విశ్వాసం’ (Viswasam)

ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించగా, అజిత్, నయనతార, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 మర్చి 1న విడుదలైంది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా 85 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి 187 కోట్ల వసూళ్లు సాధించింది.

 

Read Also : అమెరికాలో పగ తీర్చుకోవాలనుకునే అచ్చ తెలుగు లేడీ డాన్… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×