E-Paper
Advertisement

Premante Censor: ప్రేమంట మూవీకి షాకిచ్చిన సెన్సార్.. ఏకంగా 23 కట్స్

Premante Censor: ప్రేమంట మూవీకి షాకిచ్చిన సెన్సార్.. ఏకంగా 23 కట్స్

Premante Censor Report: పెళ్లిచూపులు సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. మొదటి సినిమాతోనే తరుణ్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తీసుకొచ్చిన మార్పు మామూలుది కాదు. తెలంగాణ యాసలో సినిమాలు రావడం కూడా అప్పటి నుంచే ఎక్కువగా మొదలైంది. ఆ యాసకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు తరుణ్ భాస్కర్. చిన్న సినిమాలు కూడా అద్భుతంగా ఉంటాయి అని ఆ సినిమా ప్రూవ్ చేసింది. 

ప్రేమంటే మూవీ కి షాక్

అయితే ఒక సినిమాతో నటుడుకి గుర్తింపు రావడం అనేది అరుదుగా జరుగుతుంది. ఆ సినిమాతో ప్రియదర్శికి విపరీతమైన పాజిటివిటీ వచ్చింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. కౌశిక్ అనే పాత్ర ప్రియదర్శి కెరియర్ లో ఎప్పటికీ ప్రత్యేకమే. తెలుగు దర్శకులు గురించి కొత్తగా చెప్పేదేముంది ఒకరికి మంచి పేరు వచ్చింది అంటే వాళ్ల వెనకాల పడి మరి, వాళ్లతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు. కొన్ని సినిమాల్లో నటుడుగా కనిపించిన తర్వాత ప్రియదర్శి హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ప్రేమంటే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వస్తున్నాడు ప్రియదర్శి.

ట్రైలర్ మంచి రెస్పాన్స్

ప్రియదర్శి మరియు కాయల్ ఆనంది ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న సినిమా ప్రేమంటే. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ట్రైలర్ కొంతమంది బాగానే ఆకట్టుకుంది. పెళ్లి జరిగిన తర్వాత ఒక కొత్త జంట కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులను ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాకి నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ జరిగింది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకు 23 కట్స్ చెప్పారు. మొత్తానికి 23 కట్స్ చెప్పిన తరువాత ప్లేన్ యు అండ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా డ్యూరేషన్ రెండు గంటల 26 నిమిషాలు ఉంది.

Also Read: Tamil Actress: కమిట్మెంట్ అడిగాడు.. ధనుష్ మేనేజర్ పై నటి సంచలన కామెంట్స్

ఆడియన్స్ చూస్తారా?

కొన్ని సందర్భాలలో సెలబ్రిటీస్ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆ టైం దాటిపోవడానికి కోసం మాట్లాడిన మాటలు కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. ప్రియదర్శి నటించిన చివరి సినిమా మిత్రమండలి. సినిమాను బన్నీ వాసు నిర్మించారు. ఆ సినిమా గురించి చెప్పడంలో తప్పులేదు, కానీ ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా మీరు చూడకండి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ప్రియదర్శి. ఇప్పుడు ప్రేక్షకులు కూడా దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రేమంటే సినిమాకి కరెక్ట్ డ్యూరేషన్ ఉంది. టైలర్ కూడా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీస్ కూడా చూడ్డానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆడియన్స్ చూస్తారా ప్రియదర్శి మాటమీద చూడకుండా ఉండిపోతారా అనేది కలెక్షన్స్ బట్టి తేలుతుంది.

Related News

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

Big Stories

×