E-Paper
Advertisement

12A Railway Colony : సినిమాకు డ్యూరేషన్ ఒకే , ఇంతకీ కంటెంట్ పరిస్థితి ఏంటి?

12A Railway Colony : సినిమాకు డ్యూరేషన్ ఒకే , ఇంతకీ కంటెంట్ పరిస్థితి ఏంటి?
Advertisement

12A Railway Colony : అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సినిమా పేరున ఇంటిపేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. ఇప్పటికీ కూడా చాలామంది అల్లరి నరేష్ అని పిలిస్తేనే గుర్తుపడతారు. కెరియర్ మొదట్లో కామెడీ సినిమాలకు మాత్రమే పరిమితమైన నరేష్ ఆ తర్వాత కొన్ని అద్భుతమైన పాత్రలు కూడా చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన గమ్యం సినిమాలో గాలి శీను పాత్ర ఎప్పటికీ మర్చిపోలేము.

అలానే సముద్ర కని దర్శకత్వం వహించిన శంభో శివ శంభో సినిమాలోని పాత్ర కూడా చాలా హైలెట్ అయింది. వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్న తరుణంలోనే నాంది సినిమాతో తన రూట్ మార్చాడు అల్లరి నరేష్. హరీష్ శంకర్ శిష్యుడు విజయ్ దర్శకుడుగా పరిచయమైన నాంది సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఉగ్రం సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

పర్ఫెక్ట్ డ్యూరేషన్ 

Advertisement

ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 21 తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నేడు జరుగుతుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి డ్యూరేషన్ కేవలం రెండు గంటల ఐదు నిమిషాలు మాత్రమే అని తెలుస్తుంది. ఈ సినిమాకి అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. గతంలో ఈ దర్శకుడు పొలిమేరా మరియు పొలిమేర 2 సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Advertisement

డైరెక్ట్ హాట్ స్టార్ లో విడుదలైన పొలిమేర సినిమా చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన పొలిమేర 2 సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అల్లరి నరేష్ తో వస్తున్న సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

కంటెంట్ ఓకే అయితే సేఫ్ 

ఈరోజుల్లో చాలామంది ప్రేక్షకులకు ఓపిక తక్కువగా ఉంది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాత్రం సినిమా బోర్ కొట్టినా కూడా మొబైల్ లోకి దూరిపోతున్నాడు ఆడియన్. అయితే ఈ సినిమాకి సంబంధించి డ్యూరేషన్ మాత్రం చాలా తక్కువగా ఉంది.

కంటెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా సేఫ్ అయిపోయినట్లే అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్ కూడా ఈ సినిమాపై మంచి నమ్మకాలు పెట్టుకున్నాడు. అతని నుంచి లాస్ట్ గా వచ్చిన బచ్చల మల్లి సినిమా ఊహించిన అరేంజ్ సక్సెస్ అందుకోలేదు. ఈ సినిమా తర్వాత మళ్లీ అల్లరి నరేష్ కామెడీ జోనర్ లో సినిమా చేస్తాను అని రీసెంట్ ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్ చేశాడు. నవంబర్ 21 విడుదలవుతున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Jai Hanuman: రిషబ్ శెట్టి స్ట్రిక్ట్ రూల్స్, ప్రశాంత్ ఆ లోపు పూర్తి చేయాల్సిందే

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×