E-Paper
Advertisement

Anchor Vishnu Priya: వివాదంలో చిక్కుకున్న యాంకర్ విష్ణు ప్రియ… బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఫైర్

Anchor Vishnu Priya: వివాదంలో చిక్కుకున్న యాంకర్ విష్ణు ప్రియ… బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఫైర్
Advertisement

Anchor Vishnu Priya: ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలు కూడా బాగా సీరియస్ అయిపోతున్నాయి. ఎవరు ఎందుకు రియాక్ట్ అవుతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఒక మాట ఎక్కువ మాట్లాడిన కూడా విపరీతంగా ట్రోల్ అవడం ఖాయం.చాలామంది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చాలా మాటల్లో ఒక మాటను తీసుకొని దానికి వెనక ముందు ఆలోచించకుండా దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదలైనప్పుడు విపరీతమైన ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే.

విష్ణు ప్రియ వివాదం ఇలా

Advertisement

ఆ సినిమా చూసి ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని అంతా చెప్పిన తర్వాత చున్ని తీసుకోవడం సమాజాన్ని ఫేస్ చేయగలను అని చెప్పింది. కానీ ముందు స్పీచ్ లు చాలామంది కట్ చేసి కేవలం చున్నీ తీసిన వీడియోను వైరల్ చేశారు. అందుకే సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంకర్ విష్ణు ప్రియ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పోవే పోరా అని రియాలిటీ షో తో మంచి గుర్తింపు సాధించుకుంది. సుధీర్ తో కలిసిన నటించిన ఈ సినిమా అప్పట్లో బాగా పాపులర్. ఆ తర్వాత కాలంలో కవర్ సాంగ్స్ కూడా చేస్తూ ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు పెడితే కుర్రకారుని ఆకర్షిస్తుంది. ఇక రీసెంట్ గా ఒక మీమ్ పై విష్ణుప్రియ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ ఇప్పుడు విష్ణుప్రియను చిక్కుల్లోకి నెట్టేసింది.

కామెంట్ చేయడంతో ఫైర్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ముంబై వేదికగా విడుదల చేశారు. దాంట్లో చాలామంది హిందీలో మాట్లాడారు. బాలకృష్ణ హిందీ స్పీచ్ కూడా వైరల్ గా మారింది. అయితే ఆ ఈవెంట్ లో బాలకృష్ణ కూర్చున్న ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి. హిందీ పిరియడ్లో హిందీ మాత్రమే మాట్లాడాలి అంటూ పైన టెక్స్ట్ రాశారు. కింద పన్నీ రియాక్షన్ గా బాలకృష్ణ ఫోటో పెట్టారు. ఆ మేము కు నవ్వుతూ కామెంట్ పెట్టిందో విష్ణు ప్రియ. ఇక్కడితో చాలామంది బాలకృష్ణ అభిమానులు విష్ణుప్రియ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది రిప్లైస్ లో మితిమీరి తనను కామెంట్ కూడా చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కంప్లీట్ ఫైర్ మీద ఉన్నారు.

Advertisement

Also Read: Shivaji: బ్రేక్ ఫాస్ట్, లంచ్ తర్వాతే మార్నింగ్, మ్యాట్నీలు.. మరి పాప్ కార్న్ ఎందుకొచ్చింది

బ్రహ్మాజీకి కూడా ఇదే అనుభవం

కొన్నిసార్లు కొందరికి అభిమానులు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. ఆంధ్ర పొలిటిషన్ అంబటి రాంబాబు ఒక పోస్ట్ చేస్తే దానికి సినీ నటుడు బ్రహ్మాజీ మీ డ్యాన్స్ అంటే ఇష్టం అండి అని కామెంట్ పెట్టారు. అలా కామెంట్ పెట్టడంతో చాలామంది బ్రహ్మాజీని కూడా ట్రోల్ చేశారు. ఇలాంటి ఉదాహరణలు గతంలో కూడా చాలా ఉన్నాయి. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాని మరింత జాగ్రత్తగా వాడాలి అని కొంతమంది ప్రముఖులు పదే పదే చెబుతుంటారు. ఇక ఈ విష్ణు ప్రియా కి సంబంధించిన వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. స్వయంగా విష్ణు ప్రియ వీడియో రికార్డ్ చేసి బాలకృష్ణ అభిమానులకు సారీ చెప్పిన పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×