E-Paper
Advertisement

Allu Arjun: నటి పావలా శ్యామలకు భరోసా ఇచ్చిన అల్లు అర్జున్…ప్రతినెల ఆర్థిక సాయం..

Allu Arjun: నటి పావలా శ్యామలకు భరోసా ఇచ్చిన అల్లు అర్జున్…ప్రతినెల ఆర్థిక సాయం..
Advertisement

Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పావలా శ్యామల ఒకరు. స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీగా సంపాదించినప్పటికీ ప్రస్తుతం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. తన కుమార్తె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈమె సంపాదించింది మొత్తం కూతురు చికిత్స కోసమే ఖర్చు చేయడంతో నేడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందారు.

నటి పావలా శ్యామలకు అండగా ఐకాన్ స్టార్..

పావలా శ్యామలతో పాటు తన కుమార్తె కూడా ఇదే ఆశ్రమంలో ఉన్నారు అయితే వీరి ఆనారోగ్య సమస్యల కారణంగా ప్రతి నెల మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈమె ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు తరచూ ఈమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. తాజాగా పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న నటుడు అల్లు అర్జున్ ఈమెకు అండగా నిలిచారు. పావలా శ్యామల తన కుమార్తె పరిస్థితిని తెలుసుకున్న ఈయన వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పావలా శ్యామలతో పాటు తన కుమార్తె నిత్యావసరాలు అలాగే మందుల కోసం ప్రతినెల పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందేలా అల్లు అర్జున్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.

ప్రతినెల రూ.10 వేల ఆర్థిక సాయం..

Advertisement

ఇలా ఆర్థికంగా ఒకేసారి ఆమెకు సహాయం చేయకుండా ప్రతినెల తన అవసరాలు మందుల నిమిత్తం 10000 రూపాయలు అందించడానికి బన్నీ నిర్ణయం తీసుకోవడంతో బన్నీ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఈమెకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే . నటిగా పావలా శ్యామల ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే ఈమె కూతురికి మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలలో నటించింది మొత్తం తన కుమార్తె వైద్య చికిత్స కోసం ఖర్చు చేశారు.

ఆత్మహత్యకు పాల్పడిన పావలా శ్యామల..

Advertisement

ఇప్పుడు శ్యామల వయసు పై పడటంతో గత కొంతకాలంగా ఈమెకు సినిమా అవకాశాలు లేవు దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉండటానికి కూడా సొంత ఇల్లు లేకపోవడంతో ఈమె పలు ఆశ్రమాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలను తట్టుకోలేక శ్యామల ఇటీవల ఆత్మహత్యకు కూడా పాల్పడిన సంగతి తెలిసిందే .ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన పావలా శ్యామలను ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్ లో ఉంచి ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఇక ఈమె పరిస్థితి తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తనకు సహాయం చేయటానికి ముందుకు వస్తున్నారు.

Also Read: Film Industry: ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత..విషాదంలో ఇండస్ట్రీ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×