E-Paper
Advertisement

Film Industry: ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత..విషాదంలో ఇండస్ట్రీ!

Film Industry: ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత..విషాదంలో ఇండస్ట్రీ!
Advertisement

Film Industry: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పలు కారణాలతో మరణించడంతో అభిమానులు ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా సెలబ్రిటీలు పలు కారణాలతో మరణిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సీనియర్ నటుడు విజయ్ కృష్ణ(Vijay Crishana) మరణించారు. ఈయన మరణ వార్త తెలిసిన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అయితే నటుడు విజయ్ కృష్ణ మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడి కాలేదు. విజయ్ కృష్ణ మరణించాలనే విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

షారుక్ ఖాన్ తండ్రి పాత్రలో…

విజయ్ కృష్ణ రంగస్థలం నటుడిగా నాటకాలలో నటించి గుర్తింపు పొందారు. ఇక వెండి తెరపై ఈయన ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి గుర్తింపు పొందారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shahrukh Khan)హీరోగా నటించిన దేవదాస్ (Devadas)సినిమాలో ఆయనకు తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. డాన్స్ లైక్ ఎ మ్యాన్ వంటి సినిమా ద్వారా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. విజయ్ కృష్ణ గత 25 సంవత్సరాలుగా నాటక రంగంలో ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు పొందారు. ఈయన 2004లో పమేలా రూక్స్ దర్శకత్వం వహించి, మహేష్ దత్తాని నాటకం ఆధారంగా తీసిన డాన్స్ లైక్ ఎ మ్యాన్‌లో తన పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు. గుజారిష్ , గాంధీ , పీకే వంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు .

పర్యావరణవేత్తగా విజయ్ కృష్ణ..

Advertisement

ఇక ఈయన తన సినీ కెరియర్ లో షారుక్ ఖాన్,ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్‌లతో కలిసి వెండితెరపై సందడి చేశారు . ఇలా నటుడిగా మాత్రమే కాకుండా విజయ్ కృష్ణ థియేటర్ ఆర్టిస్ట్ గా, పర్యావరణవేత్త అలాగే గోద్రేజ్ కుటుంబం వ్యాపారాలకు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇలా తన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో పురస్కారాలను గౌరవాలను సొంతం చేసుకున్న ఈయన ఉన్నఫలంగా మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

వృద్ధాప్య సమస్యలే కారణమా?

Advertisement

ఇక ఈయన మరణ వార్తను పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఈయన మరణానికి గల కారణం మాత్రం ఎప్పటి వరకు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. 81 సంవత్సరాల వయసులో విజయ్ కృష్ణ మరణించడంతో బహుశా వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈయనకు భార్య ,ప్రముఖ వ్యాపారవేత్త స్మితా కృష్ణ వారి కుమార్తె నైరికా హోల్కర్ ఉన్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ విజయ్ కృష్ణ మరణానికి గల కారణాన్ని ఎక్కడ వెల్లడించకపోవడం గమనార్హం.

Also Read: Allu Sirish Nainika wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ .. కనిపించని ముగ్గురు స్టార్స్… ఏం జరిగిందబ్బా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×