E-Paper
Advertisement

AA22XA6 మూవీ పోస్టర్‌పై ట్రోల్స్.. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఇదేం పని?

AA22XA6 మూవీ పోస్టర్‌పై ట్రోల్స్.. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఇదేం పని?
Advertisement

AI Poster: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. అయితే, అధికారిక ప్రకటన కంటే ముందే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. #AA22XA6 అనే ట్యాగ్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్ చూడ్డానికి ఎంతో ఇంటెన్స్‌గా ఉన్నప్పటికీ, నెటిజన్లు మాత్రం మేకర్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Read also-Jailer 2: ‘జైలర్ 2’లో కనిపించనున్న బాలీవుడ్ బడాస్టార్.. మాలీవుడ్ నుంచి మరో స్టార్..

ఏమిటా వివాదం?

Advertisement

వైరల్ అవుతున్న పోస్టర్‌లో ఒక భయంకరమైన పంజా చీకటి ఆకాశంలో నుంచి బయటకు వస్తున్నట్లు డిజైన్ చేశారు. “Dark, primal and intense” అంటూ దీనికి క్యాప్షన్లు కూడా జోడించారు. అయితే, ఈ పోస్టర్ ఫినిషింగ్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా ChatGPT లేదా Midjourney వంటి AI టూల్స్ ఉపయోగించి రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని టెక్-సావీ నెటిజన్లు పసిగట్టారు.

వందల కోట్ల బడ్జెట్..

అల్లు అర్జున్ వంటి గ్లోబల్ స్టార్, అట్లీ వంటి భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు కలిసినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇలాంటి క్రమంలో ఒక ఒరిజినల్ కాన్సెప్ట్ ఆర్ట్ లేదా స్కెచ్ కాకుండా, కేవలం కొన్ని నిమిషాల్లో AI ద్వారా జనరేట్ చేసిన ఇమేజ్‌ను వాడటం పట్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. “వందల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మంచి డిజైనర్లను పెట్టుకోవచ్చు కదా? AI బొమ్మలతో మాకు అప్‌డేట్లు ఇవ్వడం ఏంటి?” అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు “ఇది సినిమా నాణ్యతపై ప్రభావం చూపుతుంది” అని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Read also-OTT Movies: సుఖం కోసం ఏలియన్‌తో రొమాన్సా.. బాబోయ్ అస్సలు తట్టుకోలేరు..

సినిమా రంగానికి AI ముప్పు?

గతంలోనూ కొన్ని పెద్ద సినిమాల పోస్టర్లు, టీజర్లలో AI వాడకంపై విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్ డిజైనర్లు, ఆర్టిస్టుల శ్రమను పక్కన పెట్టి ఇలా ‘షార్ట్ కట్’ పద్ధతుల్లో పోస్టర్లు చేయడం వల్ల సినిమా రంగంలోని సృజనాత్మకత దెబ్బతింటుందనే వాదన వినిపిస్తోంది. పుష్ప-2 తర్వాత బన్నీ నుంచి రాబోయే భారీ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ హైప్ ఉంది. ఇలాంటి సమయంలో చిన్న తప్పు దొరికినా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ఈ పోస్టర్ వివాదం నిరూపించింది. చిత్ర యూనిట్ దీనిపై స్పందించి, త్వరలోనే ఒక ఒరిజినల్ మరియు పవర్‌ఫుల్ అప్‌డేట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×