Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంతకు మించిన అంచనాలతో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ సినీ ప్రియులను ఖుషీ చేస్తోంది.
Read also-అల్లు అర్జున్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ రివీల్ చేసేది అప్పుడే..
చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మొదటి భాగంలో ‘మాథ్యూ’గా ఆయన పోషించిన అతిథి పాత్ర ఎంతటి ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సీక్వెల్‌లో కూడా ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమాలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. భారతీయ సినిమా రంగంలోని నలుగురు దిగ్గజాలు ఒకే సీన్‌లో కనిపించబోతుండటం. సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నలుగురూ కలిసి ఒక ‘కాంబినేషన్ సీన్’లో మెరవబోతున్నారని టాక్. ఈ వార్త నిజమైతే, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం. భారతీయ సినిమా చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోనుంది.
Read also-ట్రోల్స్ పై మరోసారి స్పందించిన రేణు దేశాయ్.. వదిలేదే లేదు!
చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్టుగా, ‘జైలర్ 2’లో షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం సుమారు 5 రోజుల డేట్స్ కేటాయించారని సమాచారం. ఇందులో షారూఖ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్, షారూఖ్ ఖాన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మొదటి భాగంలో నటించిన రమ్యకృష్ణ, సునీల్ వంటి వారితో పాటు ఈ సీక్వెల్‌లో విద్యాబాలన్, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని, ఈ ఏడాది ఆగస్టులో ‘జైలర్’ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని రజనీకాంత్ స్వయంగా హింట్ ఇచ్చారు. మొత్తానికి నెల్సన్ దిలీప్‌కుమార్ తన ‘సినిమాటిక్ యూనివర్స్’ను ‘జైలర్ 2’తో మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మల్టీస్టారర్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.