E-Paper
Advertisement

కొత్త ఐటీ రూల్స్.. ఉద్యోగుల పంట పండినట్లే.. వామ్మో ఎన్ని ప్రయోజనాలో..!

కొత్త ఐటీ రూల్స్.. ఉద్యోగుల పంట పండినట్లే.. వామ్మో ఎన్ని ప్రయోజనాలో..!
Advertisement

Income Tax 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంతో పోలిస్తే.. ఈసారి ఉద్యోగస్తులకు అనుకూలంగా పన్ను విధానంలో ఎన్నో విఫ్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. దీని వల్ల జాబ్ చేసేవారికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూరనున్నట్లు ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ పాత పన్ను విధానానికి, కొత్తదానికి మధ్య ఉన్న తేడాలు? ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన మార్పులు? ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

పన్ను మినహాయింపు

బడ్జెట్ లో చేసిన మార్పులకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.4 లక్షలకు పెంచారు. ఒక ఉద్యోగి పొందే స్డాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా పరిగణలోకి తీసుకున్నారు. కొత్త పన్ను విధానం ప్రకారం.. 12 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారికి సెక్షన్ 87A కింద ఎలాంటి పన్ను వర్తించదు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 చేయడంతో రూ.12.75 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి పన్ను సున్నా అవుతుంది. మరోవైపు ఇతర అలవెన్సుల పెంపు కింద పిల్ల విద్యా భత్యాన్ని నెలకు రూ.100 నుంచి రూ.3000కు పెంచారు. హాస్టల్ అలవెన్స్ ను రూ.300 నుండి రూ.9000, ప్రతీ మీల్ పైన మినహాయింపును రూ.50 నుండి రూ.200కు పెంచారు.

కొత్త హెచ్‌ఆర్‌ఏ రూల్స్

Advertisement

ఏప్రిల్ 1 నుంచి కొత్త హెచ్ఆర్ఏ రూల్స్ ను సైతం అమల్లోకి తీసుకొచ్చారు. పాత విధానంలో కేవలం నాలుగు నగరాలను మాత్రమే అంటే దిల్లీ, ముంబయి, కోల్ కత్తా, చెన్నైను మెట్రో నగరాలుగా పరిగణించి అక్కడి ఉండే వారికి బేసిక్ శాలరీలో 50 శాతం వరకూ హెచ్ఆర్ఏ మినహాయింపు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మరో నాలుగు నగరాలను హెచ్ఆర్ఏ మినహాయింపు పరిధిలోకి తీసుకొచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్ ఈ జాబితాలో కొత్తగా వచ్చి చేరాయి. అలాగే కారు సౌకర్యం, ఉద్యోగులకు వడ్డీ లేని రుణాలు, భోజన సదుపాయం, బహుమతులు, బోనస్ లో మరిన్ని ప్రయోజనాలను కల్పించారు.

Also Read: బీజేపీకి అంత సీన్ లేదు.. యూడీఎఫ్‌దే విజయం, కోవలం రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డి

పాత vs కొత్త ట్యాక్స్ విధానం

Advertisement

సాధారణంగా ఒక ఉద్యోగి వార్షిక ఆదాయం రూ.15-50 లక్షల మధ్య ఉందని భావిస్తే.. కొత్త, పాత విధానాల ప్రకారం ట్యాక్స్ చెల్లింపులో వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. రూ.15 లక్షల ఆదాయం కలిగి వ్యక్తికి పాత విధానంలో రూ.2,02,800 పన్ను వర్తిస్తే.. కొత్త విధానంలో రూ.93,600 పడుతుంది. అదే రూ.20 లక్షలు అయితే కొత్త విధానంలో రూ.1,82,000 (పాతది రూ.3,58,800), రూ.30 లక్షలు అయితే రూ.4,44,600 (పాతది రూ.6,70,800), రూ. లక్షలు రూ.10,68,600 (పాతది రూ.12,94,800) పన్ను వర్తించనుంది. మెుత్తంగా చూసుకుంటే కొత్త పన్ను విధానం ద్వారా ఉద్యోగికి రూ.లక్షల్లో పన్ను మినహాయింపు లభించిందని చెప్పవచ్చు.

Also Read: Cabinet Expansion: హస్తం పార్టీలో భారీ స్కెచ్.. కొత్త మంత్రుల జాబితా ఇదే!

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×